ఆధార్ కార్డు వద్దా? అయితే వెనక్కి తీసుకోవచ్చు...

18 ఏళ్లు పైబడ్డ పౌరులు ఆధార్ వివరాలు విత్‌డ్రా చేసుకునేందుకు ఆరు నెలల గడువు ఇస్తారు. అయితే ఆధార్ వెనక్కి తీసుకునే అవకాశం అందరికీ లేదు. పాన్ కార్డు లేనివాళ్లు మాత్రమే ఆధార్ వివరాలను విత్‌డ్రా చేసుకోవచ్చు.

news18-telugu
Updated: December 6, 2018, 1:27 PM IST
ఆధార్ కార్డు వద్దా? అయితే వెనక్కి తీసుకోవచ్చు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీకు ఆధార్ కార్డు అవసరం లేదనుకుంటున్నారా? ఆధార్‌తో లాభం కన్నా నష్టమే ఎక్కువ అని భావిస్తున్నారా? అయితే మీరు మీ ఆధార్ కార్డును వెనక్కి తీసుకోవచ్చు. త్వరలో ఇది సాధ్యం కానుంది. ఆధార్ వద్దు అనుకుంటే వెనక్కి తీసుకునే అవకాశం కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ చట్టంలో ఈ మార్పులు చేయనుంది. మీ ఆధార్ డేటా, బయోమెట్రిక్స్ మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు ఆధార్ చట్టబద్ధతపై ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం ఈ మార్పులు చేయనుంది.

18 ఏళ్లు పైబడ్డ పౌరులు ఆధార్ వివరాలు విత్‌డ్రా చేసుకునేందుకు ఆరు నెలల గడువు ఇస్తారు. అయితే ఆధార్ వెనక్కి తీసుకునే అవకాశం అందరికీ లేదు. పాన్ కార్డు లేనివాళ్లు మాత్రమే ఆధార్ వివరాలను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే పౌరులందరూ తమ ఆధార్ డేటా వెనక్కి తీసుకునే అవకాశం కల్పించాలని న్యాయ శాఖ ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదన త్వరలో కేబినెట్ ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

ఎస్‌బీఐ కస్టమర్లకు ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్... ఎలాగో తెలుసుకోండిఎస్‌బీఐ కస్టమర్లకు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అన్‌లిమిటెడ్ ఫ్రీ

2018 టాప్ మొబైల్ యాప్స్ ఇవే... మీ దగ్గరున్నాయా?

జనవరి 1 లోపే టీవీ, ఫ్రిజ్ కొనండి... 7-10% రేట్లు పెరుగుతున్నాయిజియో చేతికి సావన్ మ్యూజిక్... 90 రోజుల పాటు ఫ్రీ

 
First published: December 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు