
అల్కా లంబా చుట్టూ మరో వివాదం... సోషల్ మీడియాలో దుమారం... (credit - twitter)
Alka Lamba : ఏ విషయాన్నైనా సూటిగా చెప్పడం అల్కా లంబాకు అలవాటు. అదే రకరకాల వివాదాలకు దారితీస్తోందా? తాజాగా ఆమె ఏం చేశారు?
Alka Lamba : కాంగ్రెస్ నేత, మాజీ ఆప్ ఎమ్మెల్యే... అల్కా లంబాపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యల దుమారం రేగింది. ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ దత్‌పై ఆమె చేసిన కామెంట్... సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమెకు మద్దతుగా కొందరు, ఆమెను తిడుతూ కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ అంశం ఇప్పుడు ట్రెండింగ్ సబ్జెక్ట్ అయిపోయింది. అసలీ వివాదం RSSపై ఆమె చేసిన వివాదాస్పద ట్వీట్‌తో మొదలైంది. RSSకి రాజకీయాలతో సంబంధమే లేదన్న అల్కా లంబా... "బీజేపీ నేతలంతా... RSS అక్రమార్కులే" అని ట్వీట్ చేశారు.
దీనిపై చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారిలో ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ దత్ కూడా ఉన్నాడు. "అక్రమార్కులెవరో నీ పదాలను బట్టే తెలుస్తుంది. నువ్వేంటో నీ మనస్తత్వాన్ని బట్టే తెలుస్తుంది. ఎవరి ఫొటోగ్రాఫ్పై నువ్వు ఈ పదాలు రాశావో... ఆయనపై దేశ ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలను నువ్వు తెలుసుకోవాలి. ఆయన వెంట భారతదేశం నిలిచింది. నీలాంటి పిచ్చివాళ్లు (metally ill people) తప్ప" అని తన ట్వీట్లో రాశాడు యోగేశ్వర్ దత్.
ఈ ట్వీట్‌తో అల్కాలంబా మరింత ఫైర్ అయ్యారు. ఈసారి యోగేశ్వర్ దత్‌ని టార్గెట్ చేశారు. "ఒరేయ్ యోగేశ్వర్ దత్‌గా... నీ తండ్రి ఎవరో నీ తల్లిని అడుగు. నీ తండ్రితో డీపీ పెట్టుకోవడానికి నీకు సిగ్గుగా ఉందా? ఎందుకు? నీ డీపీలో నువ్వు ఎవరినైతే దాచేస్తున్నావో, అతన్ని నీ తండ్రిగా నీ తల్లి చెప్పినప్పుడు నువ్వు అంగీకరించాలి. ఎందుకంటే తల్లి ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నువ్వు ఇలాంటి తప్పు చెయ్యడానికి కారణం కనిపించట్లేదు" అని రిప్లై ట్వీట్ ఇచ్చింది.
దీనిపై స్పందించిన యోగేశ్వర్ దత్... డిగ్నిటీ మెయింటేన్ చెయ్యలేని వాళ్ల నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం అని రాశాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చాందినీ చౌక్ నుంచి బరిలో దిగిన ఆమెను... ఓ ఆప్ కార్యకర్త చెంప చెళ్లుమనిపించాడు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో చాలాసార్లు విబేధించిన తర్వాత ఆమె ఆప్ నుంచి వైదొలగింది. ప్రస్తుతం అల్కా లంబాను సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ కొందరు ట్వీట్లు చేస్తుండటంతో... సోషల్ మీడియాలో ఈ అంశంపై దుమారం కంటిన్యూ అవుతోంది.
Published by:Krishna Kumar N
First published:April 07, 2020, 07:13 IST