హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Dawood Ibrahim: పాక్‌ మహిళను రెండో పెళ్లి చేసుకున్న దావూద్‌ ఇబ్రహీం.. వెలుగులోకి సంచలన నిజాలు!

Dawood Ibrahim: పాక్‌ మహిళను రెండో పెళ్లి చేసుకున్న దావూద్‌ ఇబ్రహీం.. వెలుగులోకి సంచలన నిజాలు!

Dawood Ibrahim: పాక్‌ మహిళను రెండో పెళ్లి చేసుకున్న దావూద్‌ ఇబ్రహీం.. వెలుగులోకి సంచలన నిజాలు!

Dawood Ibrahim: పాక్‌ మహిళను రెండో పెళ్లి చేసుకున్న దావూద్‌ ఇబ్రహీం.. వెలుగులోకి సంచలన నిజాలు!

Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం కరాచీలో తన చిరునామాను మార్చుకున్నాడని, ఇప్పుడు డిఫెన్స్ ప్రాంతానికి మారాడని NIA దర్యాప్తులో తేలింది. దావూద్ కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌లో చిరునామా మార్చుకున్నాడని, ప్రస్తుతం కరాచీలో పాక్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాంతంలో నివసిస్తున్నాడని దర్యాప్తులో ఏజెన్సీలకు క్లూ లభించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

అండర్‌ వరల్డ్‌ డాన్‌, మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం(Dawood Ibrahim) ఓ పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అతడు ఇప్పుడు పాక్‌లోని కరాచీలో ఉన్న డిఫెన్స్‌ ఏరియాలోకి మకాం మార్చాడు. ఈ విషయాన్ని దావూద్‌ సోదరి, లేటు హసీనా పార్కర్‌ కుమారుడు అలిషా ఇబ్రహీం పార్కర్‌ వెల్లడించాడు. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ( NIA) దర్యాప్తులో భాగంగా ఈ విషయాలను బయటపెట్టాడు.

దావూద్ రెండో వివాహం చేసుకున్న మహిళ పాకిస్థానీ పఠాన్‌ అని అలిషా తెలిపాడు. అయితే అతడు ఆమెను ఎప్పుడు వివాహం చేసుకున్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. మొదటి భార్య మెహజబీన్‌కు దావూడ్ విడాకులు ఇవ్వలేదని చెప్పాడు. దావూద్‌ ఇంకా ముంబైలో ఉన్న తన బంధువులతో టచ్‌లోనే ఉంటున్నాడని చెప్పుకొచ్చాడు. NIA దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం వచ్చిన మీడియా రిపోర్ట్స్‌ ఈ విధంగా ఉన్నాయి. దావూద్‌ ఇబ్రహీం ఈ మధ్య కాలంలోనే తన అడ్రస్‌ని మార్చుకున్నాడు. కరాచీలోని పాక్‌ డిఫెన్స్‌ మినిస్ట్రీ పరిధిలో ఉన్న ప్రాంతంలో తాను ఇప్పుడు బస చేస్తున్నాడు.

మీడియా కథనాల ప్రకారం, దావూద్ ఇబ్రహీం కరాచీలో తన చిరునామాను మార్చుకున్నాడని, ఇప్పుడు డిఫెన్స్ ప్రాంతానికి మారాడని NIA దర్యాప్తులో తేలింది. దావూద్ కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌లో చిరునామా మార్చుకున్నాడని, ప్రస్తుతం కరాచీలో పాక్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాంతంలో నివసిస్తున్నాడని దర్యాప్తులో ఏజెన్సీలకు క్లూ లభించింది.

* దావూద్ క్రైం సిండికేట్‌ని స్వాధీనం చేసుకున్న హసీనా పార్కర్‌

దావూద్‌ ఇబ్రహీం దేశం వదిలి పారిపోయిన తర్వాత తన తోబుట్టువు హసీనా పార్కర్(Haseena Parkar) ముంబైలోని దావూద్ క్రైమ్ సిండికేట్‌ను స్వాధీనం చేసుకుంది. ఆమె భర్తను దావూద్ ప్రత్యర్థి గ్రూపు అయిన అరుణ్ గావ్లీ గ్యాంగ్ 1991లో హతమార్చింది. ఆ సంఘటన జేజే హాస్పిటల్ కాల్పులకు దారితీసింది. హసీనా 55 ఏళ్ల వయసులో 2014లో గుండెపోటుతో మరణించింది. ఆమె జీవితం ఆధారంగా ఓ బాలీవుడ్‌ సినిమా కూడా తెరకెక్కి 2017లో విడుదలైంది. శ్రద్ధ కపూర్‌ అందులో ప్రధాన పాత్ర పోషించారు.

* అండర్‌ వరల్డ్‌ డాన్‌

షేక్ దావూద్ ఇబ్రహీం, హాజీ మస్తాన్ గ్యాంగ్‌తో తన పనిని ప్రారంభించాడు. అయితే అతి కొద్ది కాలంలోనే ముంబై అండర్ వరల్డ్‌లో కీలకంగా ఎదిగాడు. మస్తాన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ గ్యాంగ్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ముఠాని మరింత పెద్దది చేశాడు. ప్రపంచంలోనే లార్జెస్ట్‌ క్రైమ్‌ సిండికేట్లలో ఒక దాన్ని దావూద్ నడుపుతున్నాడు. 1993 ముంబయి పేలుళ్లకు సంబంధించి దావూద్‌ పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఫైనాన్సింగ్‌ చేసినట్లు, కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దావూద్‌ ఇబ్రహీం మెహజబీన్‌ షేక్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. మహ్రూఖ్ ఇబ్రహీం, మెహ్రీన్ ఇబ్రహీం, మరియా ఇబ్రహీంలు కూతుళ్లు కాగా కొడుకు పేరు మోయిన్. మహ్రూఖ్ ఇబ్రహీం ప్రముఖ పాకిస్థానీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడు జునైద్‌ను వివాహం చేసుకుంది.

First published:

Tags: International news, National News, Pakistan

ఉత్తమ కథలు