ట్రాఫిక్ రూల్స్‌కి సంబంధించి భారీ ఫైన్లు వేస్తుండటంతో... చాలా రాష్ట్రాల్లో వాహనదారులు... ఫైన్ల నుంచీ ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నారు. ఐతే... ట్రాఫిక్ పోలీసులు వాళ్ల కంటే తెలివిగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్... అలీగఢ్‌లో నమోదైన ఈ కేసులో అదే జరిగింది. కారు డ్రైవ్ చేస్తున్న ఆ యువకుడు... చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. కారు వేగం కూడా లిమిట్‌లోనే ఉంది. అలాంటిది... ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరకు రాగానే... వన్ మినిట్ అంటూ... కారును పక్కకు తెమ్మన్నారు ట్రాఫిక్ పోలీసులు. ఆ తర్వాత అతనికి రూ.500 ఫైన్‌కి సంబంధించి ఛలాన్ ఇచ్చారు. అందులో కారు నంబర్ ఉంది. హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ వేసినట్లు ఉంది. ఇదేంటని అడిగితే... పోలీసులు ఇంకెలాంటి లాపాయింట్లు లాగుతారో అన్న భయంతో అతను వెంటనే... రూ.500 చెల్లించి బయల్దేరాడు.
మర్నాడు... కారు ఎక్కుతూ... మర్చిపోకుండా హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. అలా వెళ్తుంటే... అంతా అతన్ని ఆశ్చర్యంగా చూశారు. కారు తోలుతూ... హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నాడు అని అనుకున్నారు. ఐతే... ఈ విషయమై మీడియా అతన్ని అడిగితే... పోలీసులు ఫైన్ వేస్తున్నారు కాబట్టే పెట్టుకున్నానని చెప్పాడు. వెంటనే మీడియా... ఫైన్ వేసిన పోలీసుల్ని ప్రశ్నించింది. అప్పుడు వాళ్లు ఏమన్నారో తెలుసా. "అతను చెప్పింది రైటే. మేం ఫైన్ వేశాం. కానీ అది పొరపాటుగా, టెక్నికల్ మిస్టేక్ వల్ల జరిగింది. అతను చెల్లించిన రూ.500 తిరిగి రిఫండ్ చేస్తాం. చట్టంలో అలాంటి వెసులుబాటు కూడా ఉంది" అని చెప్పారు.
అంటే... కారు తోలుతూ... మనం హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బాధితుడు చెల్లించిన డబ్బు... రెండు మూడు రోజుల్లో తిరిగి అతని అకౌంట్‌లో జమ అవుతుంది. కొన్నేళ్ల కిందట కూడా బెంగళూరులో ఇలాగే జరిగింది. సో... ఫోర్ వీలర్స్ డ్రైవ్ చేసేవారు మర్చిపోవద్దు... హెల్మెట్ లేదని పోలీసులు ఫైన్ వేస్తే... వెంటనే ఇదేంటని ప్రశ్నించండి... దర్జాగా ముందుకుసాగండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: TRAFFIC AWARENESS, Traffic challans, Traffic police, Traffic rules