Trains cancelled: ప్రయాణికులకు అలర్ట్.. తుపాన్ ప్రభావంతో పలు రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

గులాబ్ తుపాన్ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు(Trains Cancelled) చేయడంతో పాటు, కొన్నింటిని రైల్వే శాఖ దారి మళ్లించింది. మరికొన్ని రైళ్లు బయలుదేరే సమయాన్నిరీ షెడ్యూల్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు..

  • Share this:
    గులాబ్‌ తుపాను (Cyclone Gulab) నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గులాబ్ తుపాన్ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేయడంతో పాటు, కొన్నింటిని రైల్వే శాఖ దారి మళ్లించింది. కొన్నింటి గమ్యస్థానాలను కుదించారు.  నేడు, రేపు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరింది. 26వ తేదీన హౌరా నుంచి సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్(02703).. హౌరా నుంచి ఉదయం 08.35 గంటలకు బదులుగా మధ్యాహ్నం 02.35 బయలుదేరనుంది. అదే విధంగా 26వ తేదీన హౌరా నుంచి యశ్వంతపూర్ స్పెషల్ ట్రైన్(02245).. హౌరా నుంచి ఉదయం 10.50 గంటలకు బదులుగా మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరుతుంది. 26వ తేదీన టాటా నగర్ నుంచి ఎర్నాకుళం స్పెషల్ ట్రైన్.. టాటా నగర్ నుంచి ఉదయం 05.15 గంటలకు బదులుగా ఉదయం 11.15 గంటలకు బయలుదేరుతుంది.

    26వ తేదీన రద్దైన రైళ్ల వివరాలు..
    07015- భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్,
    02071- భువనేశ్వర్ నుంచి తిరుపతి,
    02859-పూరి నుంచి చెన్నై సెంట్రల్,
    02085- సాంబల్‌పూర్ నుంచి హెచ్ నాందేడ్,
    07244- రాయఘడ నుంచి గుంటూరు
    08463- భువనేశ్వర్ నుంచి కేఎస్సార్ బెంగళూరుసిటీ,
    02845- భువనేశ్వర్ నుంచి యశ్వంత్‌పూర్,

    Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్‌ తుపాను.. ఆరెంజ్ అలర్ట్ జారీ.. ఆ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు..

    27వ తేదీన రద్దైన రైళ్ల వివరాలు..
    02072- తిరుపతి నుంచి భువనేశ్వర్,
    02860-చెన్నై సెంట్రల్ నుంచి పూరి,
    02086- హెచ్‌ఎస్ నాందేడ్ నుంచి సాంబల్‌పూర్,
    08464- కేఎస్సార్ బెంగళూరు సిటీ నుంచి భువనేశ్వర్,
    02846- యశ్వంత్‌పూర్ నుంచి భువనేశ్వర్

    పలు రైళ్ల దారి మళ్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలను మీరు దక్షిణ మధ్య రైల్వే టీట్స్‌‌లో చూడొచ్చు.









    దారి మళ్లింపులు..
    -26న పూరీ-ఓఖా స్పెషల్ ట్రైన్‌ను.. ఖుర్థారోడ్‌, అంగూల్‌, సంబల్‌పూర్‌ మీదుగా దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.
    -27న విశాఖలో బయలుదేరే విశాఖ-కిరండూల్‌ ప్రత్యేక రైలును జగదల్‌పూర్‌లో నిలిపేయడంతోపాటు తిరుగు ప్రయాణంలో ఈనెల 28న జగదల్‌పూర్‌ నుంచి బయలు దేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

    ఇక, గులాబ్ తుపాన్.. ప్రస్తుతం  ఒడిశాలోని గోపాలపూర్‌కు(Gopalpur) 310 కి.మీ, శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నానికి(Kalingapatnam) 380 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఒడిశాతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలకు గులాబ్ తుపాన్ ముప్పు పొంచి ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. తుపాన్ ఆదివారం సాయంత్రానికి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
    Published by:Sumanth Kanukula
    First published: