రైలు వస్తున్న సమయంలో పట్టాలపై పడుకున్న వ్యక్తి.. చూస్తుండిపోయిన జనం.. చివరి క్షణాల్లో.. వీడియో

రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి

ఓ వ్యక్తి రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. రైలు వస్తున్న సమయంలో ప్లాట్‌ఫామ్‌ కిందకు దిగి పట్టాలపై పడుకున్నాడు.

 • Share this:
  ఓ వ్యక్తి రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. రైలు వస్తున్న సమయంలో ప్లాట్‌ఫామ్‌ కిందకు దిగి పట్టాలపై పడుకున్నాడు. అయితే అక్కడే ఉన్న ప్రయాణికులు చాలా మందికి ఏం చేయాలో తోచలేదు. అయితే చివరకు రైల్వే పోలీసులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై విరార్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసకుంది. ఫిబ్రవరి 24న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు తెగ వైరల్‌గా మారాయి. ఆత్మహత్య చేసుకునే వ్యక్తిని రక్షించిన రైల్వే పోలీసులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

  ఆ వీడియోలో.. ఓ వ్యక్తి రైలు వస్తుండగా ప్లాట్‌ఫామ్‌పై నుంచి కిందకు దిగి రైలు పట్టాలపై పడుకున్నాడు. అయితే అదే సమయంలో రైలు సమీపంలోకి వస్తుండటంతో ఎవరూ కిందకు దిగి అతన్ని రక్షించేందుకు ధైర్యం చేయలేకపోయారు. అయితే ఇది గమనించిన రైల్వే పోలీసులు వెంటనే అవతలి ప్లాట్‌ఫామ్‌ వైపు నుంచి అక్కడికి చేరుకున్నారు. పట్టాలపై పడుకున్న వ్యక్తిని ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకున్నారు. వారు అతన్ని అక్కడి నుంచి పక్కకు లాగిన క్షణాల్లోనే ట్రైన్ పట్టాలపై నుంచి వెళ్లింది.

  ఇక, ఆత్మహత్య యత్నం చేసిన వ్యక్తిని ఒడిశాకు చెందిన కిషోర్ నాయక్‌గా గుర్తించారు. తల్లి మరణంతో డిప్రేషన్‌లోకి వెళ్లి అతడు ఈ విధంగా చేసినట్టుగా తెలుస్తోంది.
  Published by:Sumanth Kanukula
  First published: