Home /News /national /

ALERT FOR CITIZENS DO NOT SHARE AADHAAR OTP OVER PHONE FOR COVID 19 VACCINE SS GH

Aadhaar OTP: ఆధార్, ఓటీపీ ఎవ్వరికీ చెప్పొద్దు.. వ్యాక్సినేషన్ ఎర చూపుతున్న మోసగాళ్లు

Aadhaar OTP: ఆధార్, ఓటీపీ ఎవ్వరికీ చెప్పొద్దు.. వ్యాక్సినేషన్ ఎర చూపుతున్న మోసగాళ్లు
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar OTP: ఆధార్, ఓటీపీ ఎవ్వరికీ చెప్పొద్దు.. వ్యాక్సినేషన్ ఎర చూపుతున్న మోసగాళ్లు (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar OTP | కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసమని ఎవరైనా మీకు ఫోన్ చేసి ఆధార్ నెంబర్, ఓటీపీ అడుగుతున్నారా? అయితే అలర్ట్.

ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు అనే మాటను మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఎక్కడో ఓ దగ్గర పొరపాటు చేసి మోసపోయేవాళ్లే ఎక్కువ. ఎక్కువగా బ్యాంకు సంబంధిత కార్యకలపాలకు వర్తించే ఈ ఓటీపీ విధానం ప్రస్తుతం చాలా వరకు వినియోగిస్తున్నారు. ఆధార్ కూడా ఓటీపీతోనే అనుసంధానమైంది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తోన్న నేపథ్యంలో కొంత మంది మోసగాళ్లు వ్యక్తిగత వివరాల కోసం ప్రజలకు గాలం వేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుంటున్నారనే సందేహంతో ప్రభుత్వం ఆధార్ ఓటీపీ వివరాలు ఎవ్వరికీ ఇవ్వొద్దని ట్విట్టర్ వేదికగా హెచ్చరించింది.

పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్టర్లో ఓ సందేశాన్ని ప్రజలకు తెలియజేసింది. "కొంతమంది మోసగాళ్లు డ్రగ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తున్నామని నమ్మిస్తున్నారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ఆధార్, OTP వివరాల కావాలని సీనియర్ సిటిజన్ల నుంచి సంబంధిత సమాచారాన్ని రాబట్టాలని చూస్తున్నారు. ఇది దురాక్రమణ చర్య. ఓటీపీ, వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ బయటకు వెల్లడించవద్దు" అని పీఐఈ ట్వీట్ చేసింది.

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌లో మొబైల్ నెంబర్, ఇమెయిల్ అప్‌డేట్ చేయండి ఇలా

LIC Jeevan Umang Plan: రిటైర్మెంట్ నాటికి రూ.94 లక్షలు కావాలా? ఈ ఎల్ఐసీ ప్లాన్ మీకోసమే


ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ను జనవరి 16న భారతదేశం ప్రారంభించింది. మొదటి దశలో ఫ్రంట్ లైన్ కార్మికులకు టీకాల అందజేస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య 16 లక్షలు దాటింది. ప్రతి ఒక్కరూ కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ కు అనుమతించబడతారు. సీనియర్ సిటిజన్లకు టీకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఇంకా వెల్లడించలేదు.

IDFC First Bank: ఉచితంగా క్రెడిట్ కార్డ్... ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సంచలనం

SBI Flexi Deposit Scheme: కనీసం రూ.500 జమ చేయగలరా? ఈ స్కీమ్ మీకోసమే

డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్, పెన్షన్ డాక్యూమెంట్, MGNERGA జాబ్ కార్డు, ఓటరు ఐడీ, ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎంఎల్సీల అధికారిక ఐడీలు, ప్రభుత్వ జారీ చేసిన సర్వీస్ ఐడీ కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు లాంటి పత్రాలు కోవిన్ యాప్ ద్వారా స్వీయ నమోదు కోసం అవసరమవుతాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar, Aadhaar card, AADHAR, Covid-19, COVID-19 vaccine, UIDAI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు