ALAPUZHA YOUTH ENTERS APPLES HALL OF FAME FOR IDENTIFYING SECURITY FLAW IN ICLOUD UMG GH
Apple Prize: ఓవర్‌నైట్ స్టార్.. ఎథికల్ హ్యాకింగ్‌లో కేరళ కుర్రోడి సూపర్ టాలెంట్.. దెబ్బకి భారీ రివార్డ్ ఇచ్చిన యాపిల్
యాపిల్ బగ్‌ను గుర్తించిన కేరళ కుర్రోడు.
టెక్ కంపెనీల్లోని డిజిటల్ సర్వీసెస్‌లో సాంకేతిక సమస్యలను కనిపెట్టి ఎందరో ఎథికల్ హ్యాకర్లు (Ethical Hacking) లక్షల రూపాయలు, పేరు ప్రతిష్ఠలు దక్కించుకున్నారు. తాజాగా కేరళకు (Kerala) చెందిన కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కె.ఎస్ అనంతకృష్ణన్ (K.S Ananthakrishnan) కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.
కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై మంచి పట్టు ఉండి.. ఎథికల్ హ్యాకింగ్ (Ethical Hacking) స్కిల్స్ వేరే లెవెల్లో ఉంటే ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోవచ్చు. ఇప్పటికే యాపిల్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీల్లోని డిజిటల్ సర్వీసెస్‌లో సాంకేతిక సమస్యలను కనిపెట్టి ఎందరో ఎథికల్ హ్యాకర్లు లక్షల రూపాయలు, పేరు ప్రతిష్ఠలు దక్కించుకున్నారు. తాజాగా కేరళకు చెందిన కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కె.ఎస్ అనంతకృష్ణన్ (K.S Ananthakrishnan) కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. ఈ స్టూడెంట్ యాపిల్ ఐక్లౌడ్ (Apple iCloud) సర్వర్‌లో కీలకమైన సెక్యూరిటీ లోపం/సమస్యను (Security Flaw) గుర్తించగలిగాడు. దీంతో అతనికి టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన ప్రతిష్ఠాత్మక హాల్ ఆఫ్ ఫేమ్‌లో మెంబర్షిప్ అందించింది. అంతేకాదు 2,500 డాలర్ల (సుమారు రూ.2 లక్షల)ను బహుమతిగా అందించింది.
వివరాల్లోకి వెళితే.. కేరళ (Kerala), అలప్పుజా జిల్లా, మంకొంబు (Mankombu) గ్రామానికి చెందిన కె.ఎస్ అనంతకృష్ణన్ తన 12వ తరగతి నుంచే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. అతని అద్భుతమైన ప్రతిభ చూసి కేరళ పోలీసు అధికారులు తమ సైబర్ డోమ్‌లో ఒక సభ్యుడిగా కూడా చేర్చుకున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేశాక అనంతకృష్ణన్ కంప్యూటర్ సైన్స్ పై మక్కువతో బీటెక్ కోర్సులో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం పతనంతిట్టలోని మౌంట్ జియోన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్‌కు సంబంధించిన ఐక్లౌడ్ సర్వర్‌లో కీలకమైన సెక్యూరిటీ లోపాన్ని గుర్తించాడు. అనంతరం ఈ సమస్య వల్ల యూజర్లకు పెద్ద ముప్పు ఉందని చెబుతూ యాపిల్ ఇంజనీర్లకు సమాచారం అందించాడు. అది నిజమేనని తెలుసుకున్న యాపిల్ కంపెనీ ఇంజనీర్లు తక్షణమే దాన్ని సరి చేశారు.
ఈ లోపం గుర్తించకపోతే ఐక్లౌడ్ ఈ-మెయిల్ యూజర్లు సెక్యూరిటీ రిస్క్‌లో పడే అవకాశం ఉంది. అయితే యాపిల్ ఇంజనీర్లు టెక్నికల్ ఎర్రర్‌ను ఫిక్స్ చేసినా కేవలం కొత్త యూజర్లకు మాత్రమే రిస్క్ తగ్గుతుందని, పాత ఖాతాదారులకు ఇప్పటికీ రిస్కు పొంచి ఉందని మళ్లీ అనంతకృష్ణన్ తెలియజేశాడు. కాగా ప్రస్తుతం పాత అకౌంట్స్‌కు కూడా ఎలాంటి సమస్యలు రాకుండా కంపెనీ ఇంజనీర్లు అన్ని సమస్యలను సాల్వ్ చేస్తున్నారు.
ఈ మేజర్ సెక్యూరిటీ ఫ్లా (Major Security Flaw) గుర్తించినందుకు గానూ అనంతకృష్ణన్‌కు హాల్ ఆఫ్ ఫేమ్ మెంబర్షిప్ ఇవ్వడంతో పాటు, 2500 డాలర్ల నగదును బహుమతిని కూడా యాపిల్ అందించింది. విశేషమేంటంటే, అనంతకృష్ణన్ ఫేస్బుక్, గిట్‌హబ్, గూగుల్ వంటి కంపెనీలలో కూడా హాల్ ఆఫ్ ఫేమ్ మెంబర్షిప్ గెలుచుకున్నాడు. తన కుమారుడి టాలెంట్ పట్ల తండ్రి కృష్ణ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తల్లి శ్రీజ చంపకుళంలోని ఫా.థామస్ పోరుకర సెంట్రల్ స్కూల్లో టీచర్‌గా వర్క్ చేస్తున్నారు. అతనికి గౌరీ పార్వతి అనే సోదరి కూడా ఉంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.