భారత్‌లో విధ్వంసానికి కుట్ర.. ఉగ్రవాదులకు అల్ ఖైదా చీఫ్ ఆదేశాలు..

కశ్మీర్‌ వేర్పాటువాద సమస్య కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తులపై ముస్లింల జిహాదీ పోరు అని జవహరి అభివర్ణించాడు. పాకిస్తాన్ అమెరికా తొత్తులా వ్యవహరిస్తూ దేశంలో ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పాడు.

news18-telugu
Updated: July 10, 2019, 6:24 PM IST
భారత్‌లో విధ్వంసానికి కుట్ర.. ఉగ్రవాదులకు అల్ ఖైదా చీఫ్ ఆదేశాలు..
అల్ ఖైదా చీఫ్ అమాన్ అల్ జవహరి..
  • Share this:
అల్-ఖైదా చీఫ్ అమాన్ అల్-జవహరీ భారత్‌పై మరోసారి కుట్రలకు తెరలేపాడు.భారత్‌పై, భారత ఆర్మీపై వరుస దాడులతో విరుచుకుపడాలని కశ్మీర్‌లోని ముజాహిద్దీన్ తీవ్రవాదులకు పిలుపునిచ్చాడు.14నిమిషాల నిడివి గల వీడియో ద్వారా అల్ జవహరీ తన సందేశాన్ని
భారత్‌లోని తీవ్రవాదులకు చేరవేశాడు. అల్ ఖైదా మీడియా వింగ్ ఈ వీడియోను విడుదల చేసింది.'డోంట్ ఫర్‌గెట్ కశ్మీర్(కశ్మీర్‌ను మరిచిపోవద్దు)' అనే పేరుతో జవహరీ ఈ వీడియో సందేశాన్ని పంపించినట్టు ఫౌండేష‌న్ ఫ‌ర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్ర‌సీస్ లాంగ్ వార్ జ‌ర్న‌ల్ త‌న వ్యాసంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది..

కశ్మీర్‌లోని ముజాహిద్దీన్ ఒకే ఎజెండాతో ముందుకెళ్లాలి. భారత ఆర్మీ, ప్రభుత్వంపై వరుస దాడులే లక్ష్యంగా సాగాలి. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కకావికలం కావాలి. మసీదులు, మార్కెట్లు మరియు ముస్లింలు ఉండే ప్రాంతాలను మాత్రం టార్గెట్ చేయవద్దు.
అల్ జవహరీ,అల్ ఖైదా చీఫ్


కశ్మీర్‌ వేర్పాటువాద సమస్య కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తులపై ముస్లింల జిహాదీ పోరు అని జవహరి అభివర్ణించాడు. పాకిస్తాన్ అమెరికా తొత్తులా వ్యవహరిస్తూ దేశంలో ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పాడు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత అల్ ఖైదాను పాక్ టార్గెట్ చేసిందని చెప్పుకొచ్చాడు. ఇక భారత్‌లో అల్ ఖైదా కార్యకలాపాలకు సూత్రధారి అయిన జకీర్ ముసా గురించి జవహరీ ప్రస్తావించకపోయినా.. వీడియో మధ్యలో అతని ఫోటో కనిపించింది. జకీర్ ముసాను మే నెలలో భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
First published: July 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...