హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

బీఎస్పీ కోసం త్యాగాలకు సిద్దమన్న అఖిలేశ్

బీఎస్పీ కోసం త్యాగాలకు సిద్దమన్న అఖిలేశ్

2019 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమిని కొనసాగించడంతో బీజేపీని గద్దెదించాలని అఖిలేశ్ యాదవ్ ఉవ్విళ్లూరుతున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమిని కొనసాగించడంతో బీజేపీని గద్దెదించాలని అఖిలేశ్ యాదవ్ ఉవ్విళ్లూరుతున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమిని కొనసాగించడంతో బీజేపీని గద్దెదించాలని అఖిలేశ్ యాదవ్ ఉవ్విళ్లూరుతున్నారు.

యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి మూణ్నాళ్ల ముచ్చటేనన్న ప్రచారాన్ని యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తోసిపుచ్చారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీఎస్పీతో పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. బీఎస్పీతో పొత్తును కొనసాగించేందుకు, మహాకూటమి కోసం అవసరమైతే కొన్ని సీట్లను త్యాగం చేసేందుకు కూడా తమ పార్టీ సిద్ధమని ప్రకటించారు. తామందరూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

ఇటీవల యూపీలో జరిగిన కైరానా, గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ లోక్‌సభ ఉపఎన్నికలో విపక్షాలన్ని కలిసి మహా కూటమిగా ఏర్పడి బీజేపీపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మహాకూటమి ఎన్నిరోజులు కొనసాగుతుందోనన్న అనుమానాలను అఖిలేశ్ తోసిపుచ్చారు. భవిష్యత్తులోనూ బీఎస్సీతో కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. అవసరమైతే 2-4 సీట్లు త్యాగం చేసేందుకు కూడా సిద్ధమన్నారు. బీజేపీని గద్దే దించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందు కోసం తామందరూ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు.

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విపక్షాల మహా కూటమి ప్రతిపాదనను తేలికగా తీసిపారేశారు. ఇప్పుడు బీజేపీని ఓడించేందుకు పనిచేస్తున్న పార్టీలన్నీ..2014లోనూ బీజేపీని ఓడించేందుకు పనిచేసిన పార్టీలేనని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లోనూ ఆ పార్టీలు తమ పార్టీని ఓడించేందుకు కలిసి పనిచేసినా..బీజేపీ పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

First published:

Tags: Akhilesh Yadav, Bjp, Mayawati, Sp-bsp

ఉత్తమ కథలు