Akhilesh Yadav Give Laptops to Students : పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ల్యాప్ టాప్ లు పంపిణీ చేశారు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akilesh Yadav).సమాజ్‌వాదీ పార్టీ (SP)చీఫ్ అఖిలేష్ యాదవ్ శుక్రవారం తన 49వ పుట్టినరోజుని జరుపుకున్నారు. అఖిలేష్ బర్త్‌డే సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రార్ధనా స్ధలాల్లో పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా 30 మంది 10,12వ తరగతి విద్యార్ధులకు అఖిలేష్ యాదవ్ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నెరవేర్చడం లేదని, తాము అధికారంలో లేకున్నా పాలకులకు వారి హామీలను గుర్తు చేసేందుకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశామని అఖిలేష్ యాదవ్ చెప్పారు.
ఎస్పీ ప్రతినిధి రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ.."ఇటీవల విడుదలైన 10,12వ తరగతి పరీక్షలలో మొదటి ఐదు స్థానాలు సాధించిన విద్యార్థులకు మా జాతీయ అధ్యక్షుడు ల్యాప్‌టాప్‌లను అందజేస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైస్కూల్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసిన మాదిరిగానే అధికారింలో లేకునా మా పార్టీ చీఫ్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందిచారు"అని తెలిపారు. అఖిలేష్ యాదవ్ బర్త్ డే వేడుకలకు సంబంధించి పార్టీ ఎలాంటి ఆదేశాలు జారీ చేయనప్పటికీ, జిల్లా యూనిట్లు పేదలకు చేరువయ్యేలా సంబరాలు చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయన్నారు.
Eknath Shinde : మోదీ,షాలకు థ్యాంక్స్..నా బలం ఏంటో సోమవారం అసెంబ్లీలో చూపిస్తా!
ఇవాళ 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్న అఖిలేష్ యాదవ్ కు సమాజ్ వాదీ పార్టీ కార్యకర్లలు,నాయకులు,సన్నిహితులు,కుటుంబసభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తని అనుచరులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లోని అతి పిన్న వయస్సులో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి రికార్డ్ సృష్టించిన అఖిలేష్ ..సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు. అఖిలేష్ యాదవ్ జూలై 1, 1973 న ఎటావా జిల్లాలోని సైఫాయ్ గ్రామంలో జన్మించాడు. 15 మార్చి 2012 న ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అఖిలేష్ యాదవ్ 24 నవంబర్ 1999 న డింపుల్ యాదవ్‌ను వివాహం చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhilesh Yadav, Laptops