ఎమ్మెల్యే ఇంట్లో ఏకే-47 రైఫిల్ లభ్యం...బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

ఆ రైఫిల్‌ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎందుకు కోసం దాచిపెట్టారు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

news18-telugu
Updated: August 16, 2019, 7:42 PM IST
ఎమ్మెల్యే ఇంట్లో ఏకే-47 రైఫిల్ లభ్యం...బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
ఎమ్మెల్యే ఇంట్లో దొరికిన ఏకే 47 రైఫిల్
  • Share this:
బీహార్‌లోని మొకామా పట్టణంలో తీవ్ర కలకలం రేేపింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అనంత్ కుమార్ ఇంట్లో ఏకే-47 రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం బీహార్ పోలీసులు ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు చేయగా రైఫిల్‌తో పాటు బెల్లెట్లు లభ్యమయ్యాయి. దాంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని కూడా రప్పించి అనంత్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. వ్యక్తిగత రక్షణ కోసం వీఐపీల దగ్గర లైసెన్స్‌డ్ రివాల్వర్లు ఉండడం సహజం. కానీ భద్రతా సిబ్బందితో పాటు మావోయిస్టులు, ఉగ్రవాదులు ఉపయోగించే ఏకే-47 రైఫిల్ ఎమ్మెల్యే ఇంట్లో దొరకడం సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ రైఫిల్‌ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎందుకు కోసం దాచిపెట్టారు? అనే కోణంలో విచారిస్తున్నారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>