ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత

ఛత్తీస్ గఢ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూశారు.

news18-telugu
Updated: May 29, 2020, 4:25 PM IST
ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత
అజిత్ జోగి (File)
  • Share this:
ఛత్తీస్ గఢ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అజిత్ జోగి కన్నుమూసినట్టు ఆయన కుమారుడు అమిత్ జోగి ప్రకటించారు. ఈ మేరకు అమిత్ జోగి ట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం ఆయనకు రెండుసార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది. అజిత్ జోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు అంతకు ముందు వైద్యులు ప్రకటించారు. మే 9న అజిత్ జోగికి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2000 సంవత్సరం నుంచి 2003 సంవత్సరం వరకు ఆయన ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 2016లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి సొంతంగా జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్ (జే)ను ఏర్పాటు చేశారు.అజిత్ జోగి గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు..

ఛత్తీస్ గఢ్‌కు తొలి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఐపీఎస్, ఐఏఎస్‌కు కూడా సెలక్ట్ అయ్యారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా కలెక్టర్‌గా 1981 నుంచి 1985 వరకు విధులు నిర్వర్తించారు.2000 సంవత్సరంలో ఛత్తీస్ గఢ్ తొలి సీఎం కావడానికి ముందు ఆయన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.

2016 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి సొంత పార్టీ జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్ (జే) పెట్టుకున్నారు.
First published: May 29, 2020, 3:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading