ఢిల్లీలో అల్లర్లు.. అర్ధరాత్రి ఎంట్రీ ఇచ్చిన అజిత్ ధోవల్..

పౌరసత్వ చట్టానికి(CAA) వ్యతిరేకంగా, అనుకూలంగా ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ రాజుకున్న నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఎంట్రీ ఇచ్చారు.

news18-telugu
Updated: February 26, 2020, 8:38 AM IST
ఢిల్లీలో అల్లర్లు.. అర్ధరాత్రి ఎంట్రీ ఇచ్చిన అజిత్ ధోవల్..
భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ ధోవల్(File)
  • Share this:
పౌరసత్వ చట్టానికి(CAA) వ్యతిరేకంగా, అనుకూలంగా ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ రాజుకున్న నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఎంట్రీ ఇచ్చారు. మంగళవారం అర్ధరాత్రి హుటాహుటిన రంగప్రవేశం చేశారు. ఢిల్లీ పోలీసు అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమైన గంటల్లోనే ధోవల్ రంగంలోకి దిగారు. మంగళవారం అర్ధరాత్రి శీలంపూర్‌లో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, ఈశాన్య డీసీపీ వేదప్రకాశ్ సూర్యలతో కలిసి శాంతిభద్రతలను పర్యవేక్షించారు. అంతేకాదు.. మౌజ్‌పూర్, జఫరాబాద్, గోకుల్‌పురి, భాజన్‌పూర్ ప్రాంతాల్లో తిరిగి పరిస్థితులను సమీక్షించారు. ఘర్షణ రాజుకున్న జఫరాబాద్, మాజ్‌పూర్, బాబర్‌పూర్ ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించారు కూడా.First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు