74వ భారత స్వాంత్రత్ర్య దినోత్సవం సందర్భంగా సైన్యం కోసం ఎయిర్ ఆసియా ఇండియా భారీ ఆఫర్ ప్రకటించింది. బేస్ ధర లేకుండా 50,000 సీట్లను ఆఫర్ చేసింది. విమాన టికెట్లలో సహజంగా బేస్ ఫేర్, ఫ్యూయల్ ఛార్జీలు, యూజర్ డెవలప్మెంట్ చార్జీలు, పాసింజర్ సర్వీస్ చార్జీలు, ఇతర చార్జీలు ఉంటాయి. ఎయిర్ ఆసియా ఇండియా ప్రకటించిన ఈ ఆఫర్ సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలనుకునే వారు ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 21లోపు తమ వివరాలు ఆన్ లైన్లో నమోదు చేయాలని సూచించింది. దీనికి ఎయిర్ ఆసియా ఇండియా సంస్థ ‘రెడ్ పాస్’ అని పేరు పెట్టింది. ఒకసారి అప్లికేషన్‌ను పరిశీలించిన తర్వాత ఆ వివరాలను ఎయిర్ ఆసియా సంస్థ టికెట్ బుకింగ్ కోసం అప్ డేట్ చేస్తారు. అయితే, ఈ రెడ్ పాస్ అనేది ఒకసారి మాత్రమే వర్తిస్తుంది. విమాన ప్రయాణ తేదీకి కనీసం 21 రోజుల ముందే దీనిపై సమాచారం ఇవ్వాలి. అలాగే, భద్రతా బలగాల కోసం బోర్డింగ్ సమయంలో లగేజ్ చెకిన్ విషయంలో కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, పారా మిలటరీ ఫోర్స్‌తో పాటు ట్రైనీ క్యాండెట్స్కు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. కరోనా వైరస్ కారణంగా అత్యంత నష్టపోయిన వ్యాపారంలో విమానయానం కూడా ఒకటి. ఈ క్రమంలో విమానయాన సంస్థలు జీతాల కోత, ఇతరత్రా ఖర్చు తగ్గించుకునే మొదలు పెట్టాయి. అలాగే, ఆదాయాన్ని ఆర్జించే మార్గాలపై కూడా దృష్టి పెట్టాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.