హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi Pollution: పాకిస్తాన్ వల్లే ఢిల్లీలో వాయు కాలుష్యం.. సుప్రీంకోర్టులో వాదనలు.. సీజేఐ ఆగ్రహం

Delhi Pollution: పాకిస్తాన్ వల్లే ఢిల్లీలో వాయు కాలుష్యం.. సుప్రీంకోర్టులో వాదనలు.. సీజేఐ ఆగ్రహం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi Pollution: ఢిల్లీ వాయు కాలుష్యానికి యూపీలోని పరిశ్రమలు కారణం కాదని.. పాకిస్తాన్ వల్లే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుందని సీనియర్ అడ్వకేట్ రంజిత్ కుమార్ వాదించారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Air Pollution)పై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా కాలుష్యం కట్టడి దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. ఏం చర్యలు తీసుకోబోతున్నారో 24 గంటల్లోగా చెప్పాలని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో.. ఇవాళ కోర్టులో అఫిడవిట్ సమర్పించింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సీజేఐ ఎన్వీ రమణ (NV Ramana), డీవై చంద్రచూడ్, సూర్యకాంత్ నేతత్వంలోని ధర్మాసనం శుక్రవారం కూడా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఢిల్లీలో వాయు కాలుష్యం కట్టడికి ఐదుగురు సభ్యుల టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై టాస్క్‌ఫోర్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్ ఉక్కుపాదం మోపుతాయని పేర్కొంది కేంద్రం. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల మేరకు ఫ్లైయింగ్ స్క్వాడ్ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది.

ఢిల్లీలో భవన నిర్మాణాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో.. ఆస్పత్రుల నిర్మాణానికి మాత్రం అనుమతి ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అందుకు సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు.. ఆస్పత్రుల నిర్మాణాలకు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చింది.

Amazon Ganja Case: అమెజాన్‌లో గంజాయి అమ్మకాలపై స్పందించిన మధ్యప్రదేశ్ హోంమంత్రి.. చర్యలు తీసుకుంటామని హామీ


Weather: వాతావరణ హెచ్చరికల్లో వీటి గురించి తెలుసా ?.. కచ్చితంగా తెలుసుకోండి


ఇక విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీ వాయు కాలుష్యానికి యూపీలోని పరిశ్రమలు కారణం కాదని.. పాకిస్తాన్ వల్లే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుందని సీనియర్ అడ్వకేట్ రంజిత్ కుమార్ వాదించారు. యూపీలోని పరిశ్రమలు ఢిల్లీకి దిగువ వైపున  ఉంటాయని,  అలాంటప్పుడు పరిశ్రమల నుంచి వెలువడే పొగ ఎగువ భాగంలో ఉండే ఢిల్లీకి ఎలా వెళ్లగలదని ప్రశ్నించారు. పాకిస్తాన్‌ వైపు నుంచే కాలుష్య కారకాలు వస్తున్నాయని.. అందుకే ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోందని వాదించారు. సుప్రీంకోర్టు ఆంక్షలతో తమ రాష్ట్రంలోని చెరుకు, పాల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆయన వ్యాఖ్యలపై సీజేఐ ఎన్వీ రమణ కాస్త ఘాటుగానే స్పందించారు. ఇప్పుడేంటి.. పాకిస్తాన్‌లో పరిశ్రమలపై నిషేధం విధించాలా? అని ప్రశ్నించారు.

మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ రంగంలోకి దిగింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని పరిశ్రమలపై ఆంక్షలు విధించారు. పారిశ్రామిక కార్యకలాపాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు.. అది కూడా 8 గంటల పాటు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఐతే సీఎన్జీ, ఇతర కాలుష్య రహిత ఇంధనాలతో నడిచే పరిశ్రమలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. కాగా, ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్నందున స్కూళ్లు, కాలజీలకు ఇప్పటికే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

First published:

Tags: Air Pollution, Delhi pollution, Supreme Court

ఉత్తమ కథలు