Air Pollution : మనదేశంలో ఎయిర్ పొల్యూషన్(Air Pollution) కారణంగా ప్రతి ఏటా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు. చలికాలంలో మంచుతో పాటు PM 2.5 స్థాయిలు (గాలిలో ఉండే కాలుష్య కణాల సంఖ్య) అత్యంత ప్రమాదకర రీతిలో పెరిగిపోతున్నాయి. ఇవి ఊపిరితిత్తులను బ్లాక్ చేసి రకరకాల జబ్బులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మనదేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఎప్పుడూ ముందువరుసలో ఉండే ఢిల్లీలో వాయుకాలుష్యం(Air Pollution In Delhi).. WHO ప్రమాణాల కంటే 21 రెట్లు అధికంగా ఉన్నట్లు యూఎస్ రీసెర్చ్ గ్రూప్.. చికాగో వర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్సిటిట్యూట్ నిర్వహించిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్(Air Quality Life Index) చెబుతోంది. ఇదే స్థాయిలో వాయుకాలుష్యం కొనసాగితే ఢిల్లీ(Delhi) ప్రజల ఆయుర్దాయం(Life Time) 10 ఏళ్ళు తగ్గిపోతోందని ఈ రిపోర్ట్ తెలిపింది.
2013 నుంచి ప్రపంచవ్యాప్తంగా 44 శాతం కాలుష్యం ఒక్క ఇండియా(India) నుంచే వస్తోందని ఈ రిపోర్ట్ తెలిపింది. ప్రపంచంలోనే కాలుష్యం అధికంగా ఉన్న దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది. దేశంలో 130 కోట్ల మంది ప్రజలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిర్దేశించిన సురక్షిత స్థాయి(5µg/m³)కంటే అధిక వాయు కాలుష్యం ఉన్న ప్రదేశాల్లోనే నివాసం ఉంటున్నారని తెలిపింది. భారత్‌లో వాయు నాణ్యత 40µg/m³గా ఉంటే దాన్ని సురక్షితంగా భావిస్తారు. కానీ 63 శాతం మంది భారతీయులు ఆ స్థాయి నాణ్యత లేని వాతావరణంలో ఉంటున్నారు. . 2019లో భారతదేశంలో గాలిలోని సూక్ష్మధూళి కణాల సాంద్రత 70.3 µg/m³గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటించకుంటే వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో నివసించే వారి జీవిత కాలం సగటున ఐదేళ్లు తగ్గనుందని తెలిపింది. ప్రస్తుతం దేశ జనాభాలో 51 కోట్ల మంది ఉత్తర భారతంలోనే నివసిస్తారని, అంటే దాదాపు 40 శాతం జనాభా వాయు కాలుష్యం వల్ల తమ జీవిత కాలంలో కనీసం 7.6 ఏళ్ల జీవితాన్ని కోల్పోతున్నట్లు రిపోర్ట్ తెలిపింది. కాలుష్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకానికి అనుగుణంగా తగ్గించగలిగితే ఉత్తరప్రదేశ్‌లోని సుమారు 24 కోట్ల మంది ప్రజల ఆయుర్దాయం 10 ఏళ్ళు పెరుగుతుందని తెలిపింది. గడిచిన రెండు దశాబ్దాల్లో భారత్ లో పారిశ్రామీకరణ విపరీతంగా పెరిగిందని,వాహనాల సంఖ్య కూడా నాలుగింతలు పెరిగిందని దీని వల్ల వాయు కాలుష్యం పెరిగినట్లు అంచనా వేశారు.
Garbage Bank : చెత్త బ్యాంక్ ఏర్పాటు..కిలో చెత్త ఇస్తే 6 రూపాయలు ఇస్తారు
వాయుకాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా మనిషి జీవిత కాలం 2.2 ఏళ్లు తగ్గనున్నట్లు షికాగో యూనివర్సిటీ నివేదిక పేర్కొంది. వాయుకాలుష్యం ప్రభావం... ధూమపానం, మద్యపానం, ఉగ్రవాదం కంటే ఎక్కువని అంచనావేసింది.పార్టికులేట్ పొల్యూషన్ వల్ల మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడిందని, ఇది మనిషి సగటు జీవితంపై ప్రభావం చూపుతోందని, 1998 నుంచి పార్టికులేట్ పొల్యూషన్ 61.4 శాతం పెరిగిందని పరిశోధకులు తెలిపారు. ఇది స్మోకింగ్ కన్నా డేంజర్ అని, స్మోకింగ్‌తో పోలిస్తే 2.5 ఏళ్లు తగ్గినట్లు అవుతుందని స్టడీ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Air Pollution, Delhi, India, Lifestyle