వాయు కాలుష్యంతో మానసిక రుగ్మతలు.. మెదడుపై తీవ్ర ప్రభావం

ప్రతీకాత్మక చిత్రం

నైట్రోజన్ డయాక్సైడ్, నాన్ మీథేన్ హైడ్రకర్బోన్, ధూళి రేణువులకు ప్రభావితం కావడం వల్ల మానవుడి మోటార్ స్కిల్స్ పై దుష్పలితాలు చూపుతాయని మరో అధ్యయనంలో ఎన్ సిబిఐ తెలిపింది.

 • Share this:
  రోజు రోజుకీ పెరుగుతున్న గాలి కాలుష్యంతో మానవ జాతిలో మానసిక రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిలోని కాలుష్యం యొక్క ప్రభావం మనిషి మానసిక స్థితిపై తీవ్రంగా ఉందని, ఫలితంగా ప్రమాదకర మార్పులు సంభవిస్తున్నట్లు, ఇందులో భాగంగానే మనిషి నైపుణ్యం, మేధో సామర్థ్యం క్షీణించడంతో ఉత్పాదకత తగ్గుతోందని చైనాకు చెందిన పెకింగ్ విశ్వవిద్యాలయం, అమెరికాకు చెందిన యేల్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది.

  ప్రధానంగా పురుషుల్లోని మానసిక స్థితిపై కాలుష్యం ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తెలిపింది.
  ఇటీవల నిర్వహించిన పత్రకా సమావేశంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సుకు చెందిన ప్రఫెసర్ డాక్టర్ హెచ్ పరమేష్ మాట్లాడుతూ, సున్నితమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునే సామర్ద్యంపై, హార్మోన్ల విడుదలపై కూడా కాలుష్యపు కారకాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కాలుష్యం మనిషి యొక్క మెదడు ఎదుగుదలపై దుష్ఫలితాలు చూపిస్తుంది. అంతే కాకుండా, గర్భధారణ సమయంలో నాడీ వ్యవస్థ, ఇతర అవయవాలను తీవ్ర స్థాయిలో నష్టపరిచి, మానవుని వ్యవహారశైలిలో మార్పులు, మానసిక రుగ్మతలకు కారణమవుతుందని పేర్కొంది.

  వాయు కాలుష్యం వల్ల కణాలపై ఒత్తిడి పెరిగి మేధోవికాస వ్యవస్థ బలహీనమవుతుందని డాక్టర్ పరమేష్ తెలిపారు. వాహనాలు వెలువరించే పొగ వల్ల పసికందుల్లో కూడా మానసికంగా సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మేధో వ్యవస్థకి సంబంధించి వాయు కాలుష్యం యొక్క ప్రభావంపై నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్(ఎన్ సిబిఐ) అధ్యయనం చేసింది. ఒక్కసారి గాలిలోని ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరుకోగానే, రక్త నాళాల్లో కలిసిపోతుందని తెలిపింది. అంతే కాకుండా, ధూళి రేణువులు ముక్కు ద్వారా నేరుగా మెదడుకు చేరుకొని దుష్పలితాలు చూపిస్తున్నట్లు, తద్వారా నాడీ వ్యవస్థపై కూడా దీని ప్రభావం ఉన్నట్లు ఆధారాలు లభించాయని తెలిపింది. తర్వాత, కణాలపై ఒత్తిడి (ఆక్సిడేటివ్ స్ట్రెస్) పెంచి ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని, ఫలితంగా ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని వివరించింది.  (మూలం: ఎన్ సిబిఐ)
  వయసు పైబడిన వారిలో మెదడు పనితీరు క్షీణించడం ద్వారా ఆల్జీమర్స్, తదితర జ్ఞాపక శక్తిని కోల్పోయే డీమేన్త్షియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారని యుఎస్-చైనా సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో పేర్కొంది.

  గుండె, ఊపిరితిత్తులు, మెదడు అంతర్గతంగా కలిసి పనిచేస్తుండడం వల్ల, అతి సూక్ష్మంగా ఉండే ధూళి రేణువులు ఒక్కసారి ఊపిరితిత్తుల ద్వారా రక్తనాళాల్లోకి చేరుకున్న తర్వాత రక్త ప్రవాహంలో మెదడుకు కూడా చేరుకుంటాయని పల్మోనోలోజిస్ట్ డాక్టర్ ఎఆర్ సోమశేఖర్ తెలిపారు. ఫలితంగా మెదడులో ఈ రేణువులు పేరుకుపోయి కణాలపై ఒత్తిడి (ఆక్సిడేటివ్ స్ట్రెస్) పెంచుతుందని, దానివల్ల జ్ఞాపక శక్తి తగ్గి అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుందని ఆయన వివరించారు.
  నైట్రోజన్ డయాక్సైడ్, నాన్ మీథేన్ హైడ్రకర్బోన్, ధూళి రేణువులకు ప్రభావితం కావడం వల్ల మానవుడి మోటార్ స్కిల్స్ పై దుష్పలితాలు చూపుతాయని మరో అధ్యయనంలో ఎన్ సిబిఐ తెలిపింది. వీటికి బిడ్డ పుట్టకముందే గర్బంలో ఉన్న శిశువుపై నాన్ వెర్బల్, కంటి చూపు ప్రభావితం అవుతాయని వివరించింది.

  బెంగళూరులోని బీడడి, రాజాజీ నగర్, పీన్యా, నేలమంగ్లా, వైట్ ఫీల్డ్ వంటి పారిశ్రమిక వాడల్లో ఎక్కువ మొత్తంలో లోహ సాంద్రత గాలిలో నిల్వ ఉండడం గమనార్హం. ఇందులో భాగంగానే పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ శశిధర గంగయ్య మాట్లాడుతూ, గాలిలో నిల్వ ఉండే లీడ్, జింక్, మెర్క్యూరీ, ఆర్సెనిక్, క్రోమియం వంటి భారీ లోహాలకు ప్రభావితం కావడం వల్ల మెదడు క్షీణించి మానసిక దౌర్బల్యానికి దారి తీస్తుందని ఆయన వివరించారు.

  -వెంకటయోగి భాను ప్రకాష్
  (Author is freelance writer and a member of 101Reporters.com)​
  Published by:Shiva Kumar Addula
  First published: