ఎయిర్ ఇండియా విమానంలో నరకం... ప్రయాణికులకు గాయాలు

Air India Flight : విమాన ప్రయాణం అంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికే ఎన్నో విమానాలు ప్రయాణికుల ప్రాణాలు తీశాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు దాదాపు నరకం చూశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 22, 2019, 6:54 AM IST
ఎయిర్ ఇండియా విమానంలో నరకం... ప్రయాణికులకు గాయాలు
ఎయిర్ ఇండియా విమానంలో నరకం... ప్రయాణికులకు గాయాలు (Credit - Twitter - ANI)
  • Share this:
అది ఎయిర్ ఇండియాకి చెందిన AI-467 విమానం. ఢిల్లీ నుంచీ విజయవాడకు బయల్దేరింది. మధ్యలో అల్పపీడనం, నైరుతీ రుతుపవనాల వల్ల వాతావరణం ప్రతికూలంగా మారింది. అయినప్పటికీ పైలట్లు... విమానాన్ని ముందుకు నడిపారు. కొంత దూరం వెళ్లాక... క్యుములోనింబస్ మేఘాలు (ఇవే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణాలు తీశాయి) అడ్డుతగిలాయి. అత్యంత ప్రమాదకరమైన ఆ మేఘాల్లోంచీ విమానం ముందుకుసాగింది. ఈ మేఘాలకు ఉన్న ప్రత్యేక లక్షణమేంటంటే... వీటిలో ఉరుములు, మెరుపులూ ఎక్కువగా ఉంటాయి. విమానం వెళ్తున్నప్పుడు ఉరుములు, మెరుపులూ ఎటాక్ చేశాయి. దాంతో... విమానంలో ఒకటే కుదుపులు. అసలు అది ప్రశాంతంగా విజయవాడ చేరుతుందా లేదా అన్న టెన్షన్‌తో ప్రయాణికులు క్షణక్షణం నరకం చూశారు.


పై డైలాగ్స్ అన్నీ మిమ్మల్ని ఈ వార్త చదివించేందుకు రాసిన డైలాగ్స్ కావు. వాస్తవ పరిస్థితి అంతకంటే దారుణంగానే సాగింది. విమానంలో కుదుపులు ఎంతలా వచ్చాయంటే... ప్రయాణికులు తినే ఆహార ప్లేట్లు, బాటిళ్లు ఎగిరిపడ్డాయి. విమాన సీట్ల కింద, ఫ్లోర్ పైనా... ఎక్కడ బడితే అక్కడ చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి. విమానంలో టాయిలెట్ మూత ఊడిపోయింది. ప్రయాణికులు... ఏం జరుగుతోందని సిబ్బందిని అడిగి తెలుసుకొని... "ఓ మై గాడ్" అంటూ దేవుణ్ని తలచుకున్నారు. కొందరు ప్రయాణికులకు గాయాలు కూడా అయ్యాయి.
ఇదంతా జరిగిన తర్వాత ఎట్టకేలకు విమానం కూల్‌గా రన్ వే పై దిగింది. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత గాయపడిన ప్రయాణికులు, సిబ్బందికి డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేశారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా మేనేజ్‌మెంట్ ఎంక్వైరీకి ఆదేశించింది. నిజానికి విమానంపై ఎలాంటి పిడుగులు పడినా ఏమీ కాకుండా... ప్రత్యేక టెక్నాలజీ అందులో ఉంటుంది. అందువల్లే ఎన్ని పిడుగులు పడినా విమానాలకు ఏమీ కాదు. మరి ఈ కేసులో ఏమైంది? అంతలా కుదుపులు ఎందుకు వచ్చాయో ఎయిర్ ఇండియా మేనేజ్‌మెంట్ చెప్పాల్సిందే.
First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు