ఆ పైలట్‌కి అంత గర్వమా.. విచారణలో విస్తుపోయే నిజాలు

ప్రయాణికులను కష్టపెట్టడం విమానయాన సంస్థలకు కొత్తేమి కాదు. చాలా సందర్భాలలో ప్రయాణికులను అవమానాలకు గురిచేయడం, హేళనగా చూడడం వంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం. కానీ 2017 సెప్టెంబర్‌లో కొచ్చిలో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ప్రమాదానికి కారణం తెలిస్తే..షాక్‌కు గురికావాల్సిందే.

news18-telugu
Updated: May 11, 2019, 12:24 PM IST
ఆ పైలట్‌కి అంత గర్వమా.. విచారణలో విస్తుపోయే నిజాలు
Image: Reuters
  • Share this:
ప్రయాణికులను కష్టపెట్టడం విమానయాన సంస్థలకు కొత్తేమి కాదు, చాలా సందర్భాలలో ప్రయాణికులను అవమానాలకు గురిచేయడం, హేళనగా చూడడం వంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం. కానీ 2017 సెప్టెంబర్‌లో కొచ్చిలో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేసు విచారణలో మరిన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అప్పట్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక ప్రమాదం జరిగింది అనుకున్నారు అందరు.  కానీ ఒక సీనియర్ పైలెట్ అహం, గర్వం ఈ ప్రమాదానికి కారణం అని ఈ సంఘటనపై లోతుగా విచారణ జరిపిన కమిటీ డీజీసీఏకు తాజాగా సమర్పించిన నివేదికలో వివరణ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే 2017, సెప్టెంబరు 17న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ అబుదాబి నుండి కొచ్చికి బయలుదేరింది. కొచ్చి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయానికి భారీ వర్షం కురుస్తోంది. ఆ సమయంలో రన్ వే పైన వున్న గుర్తులు.. విమానంలోని పైలట్‌లకు కనిపించడం లేదు, అప్పుడు ఆ విమానంలో వున్నా మహిళా కోపైలట్ తన కమాండింగ్ పైలట్‌కు కొన్ని ముఖ్య సూచనలు చేసింది. కానీ ఆ కమాండింగ్ పైలట్ తన సహచర పైలట్ మాటలను పెడచెవిన పెట్టాడు. ఆమె చెప్పిన ఏ సూచనల్ని ఆయన పాటించలేదు. గుర్తులు కనిపించనందున వేగం తగ్గించాలని, విమానాన్ని గైడ్ చేసేందుకు రన్వేపై ఓ వాహనాన్ని ఏర్పాటు చేసేలా విమానాశ్రయ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని ఆ మహిళా కోపైలట్ తన కమాండింగ్ పైలట్‌ను కోరారు.

ఎయిర్ ఇండియా (ఫైల్ ఫోటో)


అయినా అయన ఈ విషయాలు ఏమీ పట్టించుకోలేదు, అదీగాక రన్వేపై ఉన్న మలుపునకు 90 మీటర్ల ముందే విమానాన్ని పక్కకు తిప్పారు. దీంతో అది పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. దానిని బయటకు తీసుకు ఒచ్చేందుకు త్రాటిల్‌ను అప్లయ్ చేశారు. అప్పడు కూడా ఆ మహిళా పైలట్ ఆ సమయంలో అది సరైన పరిష్కారం కాదని ఎంత వారించినా అయన వినలేదు. పర్యవసానంగా విమానం మరింత లోపలికి దూసుకెళ్లింది. దీంతో విమానం ముందుభాగం భారీ స్థాయిలో దెబ్బతింది. ముఖ్య విషయం ఏమిటంటే ఆ సీనియర్ పైలట్, మహిళా కో పైలట్ మధ్య వయసులో 30 ఏళ్ల వ్యత్యాసం వుంది. వయసు రీత్యా తన కంటే చిన్నదైన కోపైలట్ సలహాల్ని తాను ఎందుకు పాటించాలనుకున్నాడో ఏమో కాని.. మహిళా కో పైలెట్ చేసిన సూచనలను పట్టించుకోకుండా ముగ్గురు ప్రయాణికులు గాయపడటానికి కారణమయ్యాడు.

అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించనప్పటికీ.. పైలట్ల మధ్య సమన్వయం లేక, అహంకారంతో ప్రవర్తిస్తే ఏంజరుగుతుందో ఈ సంఘటన రుజువు చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పైలట్ల వయస్సుల మధ్య భారీ వ్యత్యాసం ఉండకుండా జాగ్రత్త పడాలని ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ కమిటి సూచించింది. కానీ ఆ ఘటనకు కారణమైన.. ఆ సీనియర్ పైలట్‌పై ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రకటించలేదు. ఏదీ ఏమైనా ప్రయాణికులను కష్టపెట్టడంలో మాకుమేమీ సాటిలేరంటూ విమానయాన సంస్థలు మాయరోసారి నిరూపించుకున్నాయి.

First published: May 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>