Air India Big Order : టాటా గ్రూప్(Tata Group) ఆధ్వర్యంలోని ఎయిరిండియా(Air India) విమానయానరంగంలో మరో చరిత్ర సృష్టించింది. బోయింగ్(Boeing), ఎయిర్‌బస్(Airbus) సంస్థల నుంచి 470 కొత్త విమానాలను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిరిండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. 2011లో అమెరికన్ ఎయిర్‌లైన్స్ 460 విమానాల కొనుగోలు ఒప్పందం కంటే ఇది పెద్దది. ఎయిర్‌బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 విమానాలను కొంటున్నట్లు ఎయిరిండియా తెలిపింది. అయితే ఈ 470 విమానాలు మాత్రమే కాకుండా అవసరమైతే మరో 370 విమానాలను కూడా కొనుగోలు చేస్తామని ఎయిరిండియా ఆప్షన్ ఇచ్చినట్లు నిపుణ్ అగర్వాల్ గురువారం తన సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపారు. రాబోయే దశాబ్దకాలంలో ఈ విమానాల డెలివరీ అందుకోనున్నట్లు చెప్పారు. ఎయిర్ ఇండియా కుదుర్చుకున్న ఈ భారీ ఒప్పందం భారత విమానయాన మార్కెట్‌లో అందరికంటే టాప్ లో ఉండాలన్న ఆ సంస్థ ఆకాంక్షలకు, ప్రపంచవ్యాప్తంగా సేవలు మరింత విస్తరించేందుకు కల్పించుకుంటున్న అవకాశాలకు సూచిక అని విశ్లేషకులు తెలిపారు.
భారతీయ ప్రయాణికులు యూరప్ దేశాలుకు, అమెరికా, ఇతర కొన్ని దేశాలకు వెళ్లేందుకు ప్రస్తుతం ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్, ఎతిహాద్, ఇతర మధ్యప్రాచ్య దేశాల విమానయాన సంస్థలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎయిర్ ఇండియా కొత్త విమానాలు వచ్చాక ఆ పరిస్థితి మారొచ్చని అంటున్నారు. కాగా,దశాబ్దాల క్రితం ఎయిరిండియా సంస్థను టాటాలు నెలకొల్పారు. 1950లో దీన్ని ప్రభుత్వం జాతీయికరణ చేసింది. సేవల విషయంలో ప్రపంచ ప్రమాణాల సంస్థగా ఎయిరిండియాను పరిగణించే వారు. కానీ, ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ సంస్థను సరిగ్గా నిర్వహించలేకపోవడంతో ఎయిరిండియా రుణ భారం కుప్పలు తెప్పలుగా పెరిగిపోయింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎయిర్ ఇండియాను రెండేళ్ల కిందట ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
బంగారు పూతతో 111 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం..శివరాత్రి రోజున సీఎం ఓపెనింగ్
మరోవైపు, దేశీయ విమానయాన రంగంలోకి కొత్తగా ప్రవేశించిన ఆకాశ ఎయిర్ సైతం ఈ ఏడాది భారీ ఆర్డర్‌కు సిద్ధమైతున్నట్లు తెలుస్తోంది. సేవలు ప్రారంభించకముందే 72 విమానాలను ఆర్డర్ చేసిన ఆకాశ ఎయిర్ నెట్‌వర్క్‌లోకి ఇప్పటివరకు 17 విమానాలు చేరిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Air India, Boeing, Tata Group