• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • AIR INDIA LAUNCHES NON STOP DIRECT FLIGHT SERVICE BETWEEN HYDERABAD AIRPORT AND CHICAGO SU

Air India: హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లేవారికి ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్.. నేటి నుంచే..

ప్రతీకాత్మక చిత్రం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా వెళ్లే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.

  • Share this:
    శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా వెళ్లే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్, అమెరికాల మధ్య నాన్‌స్టాప్ ఫ్లైట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే చికాగో ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం నాన్ స్టాప్‌గా ప్రయాణించి శుక్రవారం 12.58 AMకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. వారానికి ఒకసారి హైదరాబాద్ టూ చికాగో, చికాగో టూ హైదరాబాద్‌ల మద్య ఎయిర్ ఇండియా నాన్‌స్టాఫ్ ఫ్లైట్ సర్వీసులను అందించనుంది. మధ్యలో ఎక్కడా ఆగకుండా ప్రయాణించడం వల్ల జర్నీ టైమ్ తగ్గనుంది. ఇదివరకు హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాలంటే మధ్యలో ఒకటి, రెండు చోట్లు ఆగి.. కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో వెళ్లాల్సిన పరిస్థితి. తాజాగా హైదరాబాద్ నుంచి అమెరికా నాన్ స్టాప్ ఫ్లైట్ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అమెరికాలోని చికాగో నుంచి డైరెక్ట్ ఫ్లైట్(AI 108) హైదరాబాద్‌కు బయలుదేరనుంది. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి చికాగోకు డైరెక్ట్ ఫ్లైట్(AI 107) బయలుదేరనుంది.

    ఇది కేవలం తెలంగాణ ప్రాంతవాసులకే కాకుండా, విజయవాడ, విశాఖపట్నం, నాగ్‌పూర్, భువనేశ్వర్, రాజమండ్రి, తిరుపతి నుంచి అమెరికా వెళ్లే ప్రయాణికులకు చాలావరకు సౌకర్యంగా మారనుంది. ఇప్పటివరకు ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్, నెవార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగోకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ముంబై నుంచి నేవార్క్, న్యూయార్క్ నగరాలకు, బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో‌కు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్ నడుస్తున్నాయి.





    అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్..
    హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్‌ స్టాప్ డైరెక్ట్ ఫ్లైట్ సేవలు ప్రారంభం కావడంపై తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎయిర్‌ ఇండియా, శంషాబాద్ ఎయిర్‌పోరట్ అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: