news18-telugu
Updated: January 26, 2019, 8:35 AM IST
ఎయిరిండియా విమానం (ప్రతీకాత్మక చిత్రం)
రిపబ్లిక్ డే సందర్భంగా షాపింగ్ మాల్స్, ఆన్ లైన్ షాపింగ్ సైట్సే కాదు... విమానయాన సంస్థ ఎయిరిండియా కూడా బంపర్ ఆఫర్లు ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణ టికెట్లపై అద్భుతమైన డిస్కౌంట్లు ఇచ్చింది. అన్ని పన్నులు కలుపుకుని ఎకానమీ క్లాస్ టికెట్‌ను కేవలం రూ. 979కే విక్రయించనున్నట్టు ఎయిరిండియా తెలిపింది. ఇవాల్టీ నుంచి ఈ నెల 28 వరకు టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. ఆఫర్లో కొనుగోలు చేసిన టికెట్లపై ఈ ఏడాది సెప్టెంబరు 30లోగా ప్రయాణాలు చేసుకోవచ్చని వివరించింది. ఎయిరిండియా వెబ్సైట్, ఎయిర్‌లైన్, సిటీ బుకింగ్ కార్యాలయాలు, కాల్‌సెంటర్లు, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ‘మొదట వచ్చిన వారికి మొదట’ ప్రాతిపదికన టికెట్ల కేటాయింపు ఉంటుందని తెలిపింది.
దేశీయంగా ఎకానమీ క్లాస్‌లో ఒకవైపు ప్రయాణానికి అన్ని పన్నులు కలుపుకుని రూ. 979కి ప్రారంభం కానుండగా, బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ. 6,965 వరకు ఉంటుందని ఎయిరిండియా పేర్కొంది. అలాగే, అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఎకానమీ క్లాస్‌లో రూ. 55 వేలకే అమెరికాకు వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. యూకే, యూరప్ సెక్టార్లకు రూ. 32 వేలు, ఆస్ట్రేలియాకు ఎకానమీ క్లాస్‌లో రూ. 50 వేలకే టికెట్లు ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ ఆసియా ప్రాంతంలోని దేశాలకు రూ.11వేలకు టికెట్లు ధరలున్నాయని.. ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని ఎయిరిండియా సిబ్బంది కోరారు. దీంతో పలువురు టికెట్లు బుక్ చేసుకొనేందుకు పోటీ పడుతున్నారు.
ఇవికూడా చదవండి :
పెరిగిన పసిడి ధరలు...లేటెస్ట్ ధరను చెక్ చేయండి
Reliance Jio: జియో నుంచి కొత్తగా రూ.594, రూ.297 ప్లాన్స్... వివరాలివే
Published by:
Sulthana Begum Shaik
First published:
January 26, 2019, 8:24 AM IST