Air India Express: ఎయిర్​ ఇండియా ఫ్లైట్​కు తప్పిన ప్రమాదం..

ప్రతీకాత్మక చిత్రం

విమానంలో ఏదైనా సాంకేతిక లోపం వచ్చినప్పుడు వెంటనే సిబ్బంది అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్​ చేస్తుంటారు. అటువంటి సంఘటనే జరిగింది కేరళ కోజికోడ్​​ ఎయిర్​పోర్ట్​లో.. కాలికట్​ నుంచి దుబాయ్​కి బయలుదేరిన ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఫైర్​ అలారం మోగింది.

  • Share this:
విమానంలో ఏదైనా సాంకేతిక లోపం వచ్చినప్పుడు వెంటనే సిబ్బంది అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్​ చేస్తుంటారు. అటువంటి సంఘటనే జరిగింది కేరళ కోజికోడ్​​ ఎయిర్​పోర్ట్​లో.. కాలికట్​ నుంచి దుబాయ్​కి బయలుదేరిన ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఫైర్​ అలారం మోగింది. దీంతో నిఘూ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ విమానాన్ని కేరళలోని కోజికోడ్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​ పోర్టులో ఎమర్జెన్నీ ల్యాండింగ్​ చేశారు. దీంతో, విమానంలో ఉన్న 17 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ ఇండియా ఎక్స్​ప్రెస్ విమానం ఇవాళ ఉదయం 17 మంది ప్రయాణికులతో కాలికట్​ నుంచి దుబాయ్​కి బయలుదేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కార్గో కంపార్ట్​మెంట్​లో ఫైర్​ హెచ్చరిక రావడాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమై దాన్ని కోజికోడ్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టులో అత్యవసరంగా దింపేశారు. అయితే, విమాన ప్రమాదాన్ని ముందే పసిగట్టకపోతే పెద్ద ప్రమాదం జరిగేది.

కానీ, అధికారుల చాకచక్యంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్​ చేసి.. ప్రయాణికులను రక్షించారు. విమానం ల్యాండింగ్​పై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ “ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్​ కోజికోడ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్​ చేయాల్సి వచ్చింది. 17 మంది ప్రయాణికులతో ఈ విమానం కాలికట్ నుండి -కువైట్​కు బయలుదేరింది. అయితే, టేకాఫ్​ అయిన కొద్ది క్షణాల్లో ఫైర్​ అలారం మోగడంతో మా సిబ్బంది అప్రమత్త మై ప్రమాదాన్ని తప్పించారు. ప్రస్తుతం, అందులోని ప్రయాణీకులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. ” అని తెలిపారు.

ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ..
విమానం అత్యవసర ల్యాండింగ్​పై కోజికోడ్​ విమానాశ్రయం డైరెక్టర్- ఇన్​ఛార్జ్ ముహమ్మద్ సాహిద్ పిటిఐతో మాట్లాడుతూ.. ‘‘విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ఉదయం 8.38 నిమిషాలకు విమానం టేకాఫ్​ అయ్యింది. అయితే టేకాఫ్​ అయిన కొద్ది నిమిషాల్లోనే కార్గో కంపార్ట్​మెంట్​లో ఫైర్​ అలారం మోగింది. దీంతో వెంటనే అప్రమత్తమై ఉదయం 9.11 నిమిషాలకు కోజికోడ్​ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాము.” అని తెలిపారు. అయితే, ఫైర్​ అలారం మోగడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఎటువంటి ప్రమాదపు ఆనవాళ్లు లేకపోయినా ఫైర్ అలారం మోగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అలారంలోని సాంకేతిక తప్పిదమే దీనికి కారణమని వారు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మరోసారి దర్యాప్తు చేపట్టామని ఎయిర్​ ఇండియా అధికారులు తెలిపారు. అయితే, ఆ విమానంలో కువైట్​కు ప్రయాణించాల్సిన 17 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది ఎయిర్​ ఇండియా.
First published: