• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • AIMIM TO CONTEST IN WEST BENGAL NEW TENSION FOR TRINAMOOL CONGRESS AK

West Bengal AIMIM: బెంగాల్‌లో పోటీ చేయనున్న ఎంఐఎం... మమతకు కొత్త టెన్షన్ ?

West Bengal AIMIM: బెంగాల్‌లో పోటీ చేయనున్న ఎంఐఎం... మమతకు కొత్త టెన్షన్ ?

అసదుద్దీన్ ఓవైసీ(ఫైల్ ఫొటో)

West Bengal AIMIM: ఎంఐఎం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడంతో.. ఈ ప్రభావం తృణమూల్ కాంగ్రెస్‌పై ఏ రకంగా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

  • Share this:
    ఈ ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం.. వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీప నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్‌లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను తనతో సమావేశమైన బెంగాల్ నేతలతో చర్చించారు. వారితో చర్చలు ఫలవంతమైనట్లు ట్విటర్‌లో వెల్లడించారు. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉన్నతికి చేపట్టాల్సిన భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. సమావేశానికి హాజరైన నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

    వచ్చే ఏడాది జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ కూడా తీవ్రంగా కృషి చేసింది. బెంగాల్ సీఎం మమత బెనర్జీ.. బీజేపీని నిలువరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే బెంగాల్‌లో ఎంఐఎం పోటీ తృణమూల్‌ను టెన్షన్ పెట్టే విషయమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంఐఎం దెబ్బతో బిహార్‌లో మహాఘట్‌ బంధన్‌ను అధికారానికి దూరం చేసింది.‌ ఆర్జేడీకి సంప్రదాయ ఓటు బ్యాంకులో యాదవులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు. ఐదు స్థానాల్లో గెలుపొందడమే కాకుండా.. చాలా స్థానాల్లో ఆర్జేడీకి పడాల్సిన మైనార్టీ ఓట్లను ఎంఐఎం సొంతం చేసుకుంది. దీంతో బీహార్‌లో మహాఘట్ బంధన్ అధికారానికి దూరమైంది.

    తాజాగా ఎంఐఎం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడంతో.. ఈ ప్రభావం తృణమూల్ కాంగ్రెస్‌పై ఏ రకంగా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు బెంగాల్ అసెంబ్లీలో కనీసం 20 మంది ఎంఐఎం సభ్యులుండేలా ఓవైసీ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లోచర్చ జరుగుతోంది. ముస్లింల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను ఎంఐఎం టార్గెట్ చేస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: