• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • AIMIM CONTEST IN UTTAR PRADESH WILL HELP US SAYS BJP MP SAKSHI MAHARAJ AK

ఎంఐఎం పోటీ.. మా విజయానికి సహకారం.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

ఎంఐఎం పోటీ.. మా విజయానికి సహకారం.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

Sakshi Maharaj: తమ పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందన్న అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన సాక్షి మహారాజ్.. ఇదంతా దేవుడి దయ అని అన్నారు.

  • Share this:
    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం వల్ల బీజేపీ విజయానికి కారణమవుతుందని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ అన్నారు. తమ పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందన్న అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన సాక్షి మహారాజ్.. ఇదంతా దేవుడి దయ అని అన్నారు. దేవుడు ఆయనకు శక్తి ఇవ్వాలని అన్నారు. ఆయన బీహార్‌లో తమ విజయానికి సహకరించారని.. ఉత్తరప్రదేశ్, బెంగాల్‌లోనూ అదే చేస్తారని వ్యాఖ్యానించారు. గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎంఐఎం.. ఐదు స్థానాల్లో విజయం సాధించింది.

    అయితే ఎంఐఎం మైనార్టీ ఓట్లను చీల్చడం వల్లే ఆర్జేడీ, కాంగ్రెస్ కలయికలోని కూటమి అధికారంలోకి రాలేకపోయిందని గణాంకాలు స్పష్టం చేశాయి. తమ కూటమి తరువాత ఎంఐఎం బీజేపీకి బీ టీమ్ అనే ఆరోపణలు చేసింది. బీహార్ తరువాత పశ్చిమ బెంగాల్‌లోనూ తాము సొంతంగా పోటీ చేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించడం తృణమూల్ కాంగ్రెస్‌లో కలవరం రేపింది. పశ్చిమ బెంగాల్‌లో 27 శాతం ముస్లిం జనాభాలో మెజార్టీ శాతం తృణమూల్‌కు మద్దతుగా ఉండటంతో.. ఎంఐఎం పోటీ వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆ పార్టీ భావిస్తోంది.

    బీజేపీకి విజయానికి పరోక్షంగా సహకరించేందుకే ఎంఐఎం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని తృణమూల్ ఆరోపించింది. అయితే ఆ వాదనలను అసదుద్దీన్ ఖండించారు. త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎంఐఎం.. వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నట్టు ప్రకటించడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్‌బర్ మోర్చా కూటమిలో తాము భాగమవుతామని ఓవైసీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎంఐఎం పోటీపై స్పందించిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్.. ఆయన యూపీలో పోటీ చేయడమంటే తమ విజయానికి సహకరించినట్టే అనే విధంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు