Asaduddin Owaisi On Lord Shiva Temple : రాజస్తాన్(Rajastan)రాష్ట్రంలోని అల్వార్ జిల్లా సరాయ్ మొహల్లాలో 300 సంవత్సరాల చరిత్రగల శివాలయాన్ని కూల్చివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు మున్సిపాలిటీ సమావేశంలో ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నామని..ఈ క్రమంలో ఆ శివాలయాన్ని(Lord Shiva Temple) బుల్డోజర్లతో కూల్చివేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ శివప్రసాద్ నకటే శుక్రవారం తెలిపారు. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ కు ముందు,..ఆలయ పూజారులు గుడిలోని విగ్రహాలను వేరే ప్రదేశానికి మార్చారని చెప్పారు. అయితే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ ఈ చారిత్రక ఆలయం కూల్చివేత జరిగింది. 300 సంవత్సరాల చరిత్రగల శివాలయాన్ని కూల్చివేయడంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. ఈ శివాలయం కూల్చివేతను తాను ఖండిస్తున్నానని అన్నారు.
ఆదివారం ఓవైసీ( Asaduddin Owaisi)హైదరాబాద్ లో విలేఖరులతో మాట్లాడుతూ...అన్ని మతాలకు స్వేచ్ఛ ఉండాలనే అంశాన్ని తమ పార్టీ విశ్వసిస్తుందన్నారు. ఆలయం కూల్చివేత విషయంలో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ చేతులు దులిపేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్‌గఢ్ మునిసిపాలిటీ పరిధిలో ఉందని, ఈ మునిసిపాలిటీ పాలక వర్గం బీజేపీదేనని కాంగ్రెస్ వాదిస్తోందని అసదుద్దీన్ ఫైర్ అయ్యారు. మునిసిపల్ బోర్డు బీజేపీ నేతృత్వంలో ఉందని, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని ఆయన దుయ్యబట్టారు. శివాలయాన్ని కూల్చేయాలన్న మునిసిపల్ బోర్డు నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదించిందని ఒవైసీ ఫైరయ్యారు. ఈ కూల్చివేతపై ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ALSO READ OLA Electric: ఓలా సంచలన నిర్ణయం.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్నింటినీ రీకాల్..
వాయువ్య ఢిల్లీ ప్రాంతం జహంగీర్ పురిలో అక్రమ ఆక్రమణలను బుల్ డోజర్ లతో కూల్చివేయడం గురించి ప్రస్తావిస్తూ..అక్కడ, 85 శాతం ఇళ్లు ఒకే వర్గానికి చెందినవని..అసలు కూల్చివేతకు ముందు అక్కడ నివసించేవారికి ఎలాంటి నోటీస్ పంపలేదని AIMIM చీఫ్ ఆరోపించారు. కేవలం బీజేపీ చీఫ్ రాసిన ఓ లేఖ ఆధారంగానే కూల్చివేత జరిగిందని ఓవైసీ ఆరోపించారు. ఢిల్లీ, ఖార్గోన్ లేదా గుజరాత్‌లో అనుసరించని సహజ న్యాయ సూత్రాలను దృష్టిలో ఉంచుకోకుండా మీరు ఎవరి ఇంటిని, వ్యాపారాన్ని లేదా మతపరమైన స్థలాన్ని కూల్చివేయలేరు అని ఓవైసీ వ్యాఖ్యానించారు.
ALSO READ HIV : కండోమ్స్ కొనకుండా కక్కుర్తి..ఎయిడ్స్ కేసుల్లో మన రాష్ట్రమే నెంబర్-1
మరోవైపు,రాజస్తాన్ లో శివాలయం కూల్చివేత ఘటనకు సంబంధించి బీజేపీ నేత అమిత్ మాల్వియా ఓ వీడియోను ఆయన ట్వీట్టర్ లో షేర్ చేశారు. కరౌలీ, జహంగిర్‌పురి ఘటనలపై మొసలి కన్నీరు కార్చిన కాంగ్రెస్.. హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని, ఇదే ఆ పార్టీ ఆచరిస్తున్న లౌకికతత్వం అని విమర్శించారు. ఏప్రిల్ 18న ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఈ అధికారులు .. రాజ్‌గడ్ పట్టణంలో 85 మంది హిందువులకు చెందిన పక్కా ఇళ్లను, షాపులను బుల్డోజర్లతో నేలమట్టం చేసినట్లు తెలిపారు. అయితే బీజేపీ వాదనలు పచ్చి అబద్ధాలని రాజస్తాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచారియవాస్ తెలిపారు. రాజ్‌గడ్ అర్బన్ బాడీస్ బోర్డు చైర్మన్ ఒక బీజేపీ సభ్యుడు అని, ఆలయాలు, ఇళ్లను నేలమట్టం చేయాలన్న ప్రతిపాదన ఆయన చేసినవేనని పేర్కొన్నారు. చైర్మన్ సమక్షంలోనే ఆ శివాలయాన్ని ధ్వంసం చేశారని, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ కూల్చివేతలను ఆపేయాలని కోరుతున్నప్పటికీ వారు ఆపలేదని తెలిపారు. అంతేకాకుండా.. న్యాయపరమైన చిక్కులేమీ లేకుంటే తాము ఆ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIMIM, Asaduddin Owaisi, Lord Shiva, Rajastan