• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • AIIMS DIRECTOR RANDEEP GULERIA SAYS MISUSE OF STEROIDS A MAJOR CAUSE OF BLACK FUNGUS SU

Black Fungus: బ్లాక్ ఫంగస్‌పై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు.. వాటిని దుర్వినియోగం చేయడమే..

Black Fungus: బ్లాక్ ఫంగస్‌పై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు.. వాటిని దుర్వినియోగం చేయడమే..

ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా(Image:ANI)

పలు రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి. బ్లాక్‌ఫంగస్‌గా పిలిచే మ్యూకోర్‌మైకోసిస్‌ సంక్రమణ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

  • Share this:
    దేశంలో కరోనా బారినపడి, కోలుకున్నవారిలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో కోవిడ్ నుంచి కోలుకున్న కొందరిని మరణం వెంటాడుతోంది. పలు రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి. బ్లాక్‌ఫంగస్‌గా పిలిచే మ్యూకోర్‌మైకోసిస్‌ సంక్రమణ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే మ్యూకోర్‌మైకోసిస్‌కు సంబంధించి ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా(Randeep Guleria) పలు అంశాలను వివరించారు. మ్యూకోర్‌మైకోసిస్ సంక్రమణ చాలా ప్రమాదకరమైనదని.. ఇది వ్యాప్తి చెందకుండా ఆస్పత్రులలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ ‌ముందు కూడా ఇలాంటి కేసులు నమోదైనప్పటికీ.. అవి చాలా తక్కువ అని అన్నారు. మ్యూకోర్‌మైకోసిస్‌ సంక్రమణకు స్టెరాయిడ్ల దుర్వినియోగం ఒక ప్రధాన కారణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

    ‘కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఆస్పత్రులలో కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ విధానాలను పాటించాలి. ఇప్పుడు మనం సెకండరీ ఇన్ఫెక్షన్ చూస్తున్నాం. ఫంగల్, బ్యాక్టీరియల్.. ఇవి ఎక్కువ మరణాలకు కారణమవుతున్నట్టు అనిపిస్తోంది. మ్యూకోర్‌మైకోసిస్‌ మూలాలు గాలి, నేల, నీటిలో కనిపించినప్పటికీ.. అవి అంతగా సంక్రమణకు కారణం కావు. కోవిడ్‌కు ఇలాంటి ఇన్ఫెక్షన్‌ కేసులు చాలా తక్కువగా చూశాం. కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా పెద్ద సంఖ్యలో ఇలాంటి కేసులను చూస్తున్నాం. ఎయిమ్స్‌లో మొత్తం 23 మంది రోగులు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్నారు. అందులో 20 మంది కరోనా పాజిటివ్ రోగులు కాగా, మిగిలిన ముగ్గరికి కరోనా నెగిటివ్‌గా తేలింది.





    చాలా రాష్ట్రాల నుంచి 500కు పైగా మ్యూకోర్‌మైకోసిస్‌ కేసులు నమోదయ్యాయి. మ్యూకోర్‌మైకోసిస్‌ ముఖ్యంగా ముఖం, ముక్కు, కంటి కక్ష్య, మెదడుపై ప్రభావం చూపెడుతోంది. ఇది కొన్నిసార్లు కంటి చూపు కోల్పోవడానికి కారణమవుతుంది. ఇది ఊపిరితిత్తులకు కూడా వ్యాపిస్తోంది. మ్యూకోర్‌మైకోసిస్‌ సంక్రమణకు స్టెరాయిడ్ల దుర్వినియోగం ఒక ప్రధాన కారణం. డయాబెటిక్‌తో బాధపడుతూ కోవిడ్ సోకి స్టైరాయిడ్స్ తీసుకుంటున్న వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని నివారించడానికి స్టెరాయిడ్ల దుర్వినియోగాన్ని ఆపాలి’ అని రణదీప్ గులేరియా అన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు