AIIMS DIRECTOR DR RANDEEP GULERIA SAID THAT ONE CT SCAN IS EQUIVALENT TO 300 TO 400 CHEST XRAYS AND THIS INCREASES THE RISK OF HAVING CANCER IN LATER LIFE AND ESPECIALLY IN YOUTH SSR
ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. అయినదానికి, కానిదానికీ సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సీటీ స్కాన్ చేయించుకున్న క్రమంలో వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశముందని తెలిపారు. ఒక్క సిటీ స్కాన్ 300 నుంచి 400 ఛాతి ఎక్స్-రే పరీక్షలకు సమానమని.. పదేపదే సీటీ స్కాన్ చేయడం వల్ల యువతకు కూడా క్యాన్సర్ ముప్పు ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరించారు.
ఈ కరోనా కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న కరోనా నిర్ధారిత టెస్టుల్లో సీటీ స్కాన్ ఒకటి. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో వాస్తవికత ఉండటం లేదని, కొన్నిసార్లు నెగిటివ్ వచ్చిన వారికి పాజిటివ్‌గా, పాజిటివ్ వచ్చిన వారికి నెగిటివ్‌గా చూపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లు సీటీ స్కాన్ చేయించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌తో పోల్చుకుంటే సీటీ స్కాన్ ఖర్చుతో కూడుకున్నప్పటికీ కచ్చితమైన ఫలితాలు సీటీ స్కాన్ చేస్తే తెలిసిపోతాయనే నమ్మకంతో ఆసుపత్రులకు వెళ్లి టెస్ట్ చేయించుకుంటున్నారు. అయితే.. ఈ సీటీ స్కాన్ గురించి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. అయినదానికి, కానిదానికీ సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సీటీ స్కాన్ చేయించుకున్న క్రమంలో వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశముందని తెలిపారు. ఒక్క సిటీ స్కాన్ 300 నుంచి 400 ఛాతి ఎక్స్-రే పరీక్షలకు సమానమని.. పదేపదే సీటీ స్కాన్ చేయడం వల్ల యువతకు కూడా క్యాన్సర్ ముప్పు ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరించారు. ఈ విషయం ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ కమిషన్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ మెడిసిన్’ డేటాతో వెల్లడైందన్నారు. తక్కువ లక్షణాలు కనిపించిన వారు సీటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. సీటీ స్కాన్ చేయించుకుంటున్న వారిలో దాదాపు 30 నుంచి 40 శాతం మంది లక్షణాలు లేని వారేనని తెలిపారు. స్వల్ప లక్షణాలు కనిపించిన వారు హోం ఐసోలేషన్ పాటిస్తే సరిపోతుందని.. సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు.
స్వల్ప లక్షణాలు ఉన్నాయని భావిస్తే ఎక్స్-రే చేయించుకుంటే సరిపోతుందని.. సీటీ స్కాన్ వరకూ వెళ్లొద్దని ఆయన సూచించారు. సీటీ స్కాన్‌లో పాజిటివ్‌గా తేలిన 30 నుంచి 40 శాతం మందికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండానే కరోనా నయమవుతోందని చెప్పారు. బయోమేకర్స్ కూడా చాలా ప్రమాదమని, వైద్యుల సలహా మేరకే సీటీ స్కాన్ చేయించుకోవాలని ఆయన సూచించారు.
సీటీ స్కాన్ అనేది కంప్యూటెడ్ టోమోగ్రఫీ టెస్టింగ్ విధానం. చెస్ట్ లేదా బ్రెయిన్‌ను స్కాన్ చేయడానికి ఈ విధానాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. సీటీ స్కాన్స్‌లో మొత్తం 11 రకాలున్నాయి. ఊపిరితిత్తుల వరకూ కరోనా వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్ చేరిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఇప్పట్లో ఎక్కువగా సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.