హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Vijayalakshmi passes away: పన్నీర్‌సెల్వం సతీమణి కన్నుమూత

Vijayalakshmi passes away: పన్నీర్‌సెల్వం సతీమణి కన్నుమూత

విజయలక్ష్మీ (File Photo - image credit - twitter)

విజయలక్ష్మీ (File Photo - image credit - twitter)

Vijayalakshmi passes away: కొన్నాళ్లుగా విజయలక్ష్మీ ఆరోగ్యం సరిగా లేదు. ఈ కారణంగానే ఆమె హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు.

Vijayalakshmi passes away: అన్నాడీఎంకే (AIADMK) నేత పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ... హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు. విజయలక్ష్మీ (Vijayalakshmi) రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఆమెకు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఐతే... ఆమెకు శరీరంలోని కొన్ని అవయవాలకు అనారోగ్య సమస్యలున్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆమె ఆరోగ్యం క్షీణించింది. సడెన్‌గా హార్ట్ ఎటాక్ (Heart Attack) రావడంతో... ఆమెను కాపాడటం డాక్టర్ల వల్ల కాలేదు.

విషాదంలో ఓపీఎస్: పన్నీర్ సెల్వం పార్టీ అన్నాడీఎంకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఈ పార్టీలో నిస్తేజం అలుముకుంది. మళ్లీ ఇప్పట్లో ఎన్నికలు జరగవనే ఉద్దేశంతో పార్టీ శ్రేణులు కూడా రాజకీయంగా యాక్టివ్‌గా లేవు. ఈ సమయంలో... తమిళనాడుకి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ సెల్వం (Panneerselvam).. ప్రస్తుతం అసెంబ్లీలో విపక్ష ఉపనేతగా కొనసాగుతున్నారు. జీవిత భాగస్వామిని కోల్పోయి ఆయన తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇది కూడా చదవండి: COVID: ఇండియాలో వారంలో 32 శాతం పెరిగిన కరోనా కేసులు.. అప్‌డేట్స్

విజయలక్ష్మీ వయసు 63 ఏళ్లు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో... అన్నాడీఎంకే పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

First published:

Tags: Tamil nadu, Tamil nadu Politics