• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • AIADMK FLAG HOISTED AGAIN IN SASIKALA CAR AIADMK FLAG SSR

Sasikala Returns: బెంగళూరు నుంచి తమిళనాడుకు బయల్దేరిన శశికళ.. ఆమె కారుపై మళ్లీ..

Sasikala Returns: బెంగళూరు నుంచి తమిళనాడుకు బయల్దేరిన శశికళ.. ఆమె కారుపై మళ్లీ..

అన్నాడీఎంకే జెండాతో బెంగళూరు నుంచి శశికళ పయనం

అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ సీఎం జయలలిత నిచ్చెలి శశికళ చెన్నై ఎంట్రీ తమిళనాడులో ఉత్కంఠ రేపుతోంది. జయలలిత రాజకీయ వారసత్వం కోసం శశికళకు, అన్నాడీఎంకే మధ్య నడుస్తున్న పోరు ఆసక్తికరంగా మారింది. బెంగళూరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంలో...

  • Share this:
    బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ సీఎం జయలలిత నిచ్చెలి శశికళ చెన్నై ఎంట్రీ తమిళనాడులో ఉత్కంఠ రేపుతోంది. జయలలిత రాజకీయ వారసత్వం కోసం శశికళకు, అన్నాడీఎంకే మధ్య నడుస్తున్న పోరు ఆసక్తికరంగా మారింది. బెంగళూరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంలో అన్నాడీఎంకే జెండాను కారుపై ఉపయోగించిన శశికళ ఆ పార్టీ జయలలిత తర్వాత తనదేనన్న సంకేతాలను పంపే ప్రయత్నం చేశారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన అన్నాడీఎంకే అధిష్టానం తమిళనాడులో కూడా ఆమె పార్టీ జెండాను ఉపయోగిస్తే తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించి అప్రమత్తమైంది. అన్నాడీఎంకే జెండాను ఉపయోగించేందుకు శశికళ అనర్హురాలని, ఆమెను పార్టీ నుంచి బహిష్కరించామని.. అందువల్ల పార్టీ జెండాను ఆమె గానీ, ఆమె వర్గంగానీ ఉపయోగించుకుండా చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే మంత్రులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అన్నాడీఎంకే జెండాను ఉపయోగించకూడదని శశికళకు స్పష్టమైన ఆదేశాలు పంపారు.

    అయితే.. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి బయల్దేరిన శశికళ మాత్రం అన్నాడీఎంకే జెండాతోనే తన కారులో చెన్నైకి బయల్దేరారు. ఆమె కారు వెంట 100కు పైగా కార్లు బయల్దేరినట్లు తెలిసింది. ప్రతీ కారుపై అన్నాడీఎంకే జెండాను ఉపయోగించినట్లు సమాచారం. ఆమె మాత్రమే కాదు, ఆమె వర్గం కూడా స్వాగత ఏర్పాట్లలో అన్నాడీఎంకే జెండాలను ఉపయోగించనున్నట్లు తెలిసింది. ఆమెకు స్వాగతం పలికేందుకు అన్నాడీఎంకే జెండాలతో చెన్నై హైవేపై ఆమె మద్దతుదారులు నిరీక్షిస్తున్నారు. శశికళ ఫొటోతో ముద్రించిన జెండాలు కూడా కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీ ఆ పార్టీ జెండాను శశికళ ఉపయోగించకూడదని చెప్పినా ఆమె పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయానికి కూడా శశికళ వెళతారన్న ప్రచారం జరుగుతోంది.

    అయితే.. ఈ ప్రచారంపై మంత్రి డి.జయకుమార్ స్పందిస్తూ.. శశికళ పార్టీ కార్యాలయంలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా రెండు దశాబ్దాలుగా వ్యవహరించారని.. ఆమె సహాయకురాలిగా ఉన్న శశికళను పార్టీలోకి చేర్చుకోలేదని మంత్రి గుర్తుచేశారు. పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తిని మళ్లీ పార్టీలోకి చేర్చుకునే అవకాశం లేదని మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు