హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ahmednagar Fire: ఆస్పత్రి ఐసీయూలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది కోవిడ్ రోగులు దుర్మరణం

Ahmednagar Fire: ఆస్పత్రి ఐసీయూలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది కోవిడ్ రోగులు దుర్మరణం

ఐసీయూలో అగ్నిప్రమాద దృశ్యాలు

ఐసీయూలో అగ్నిప్రమాద దృశ్యాలు

Ahmednagar Fire Accident: మహారాష్ట్ర ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరగడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఇలాంటి ఘోరమే జరిగింది. పాల్ఘర్ జిల్లా విరార్‌లోని విజయ్‌ వల్లభ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి 14 మంది మరణించారు

మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం (Maharashtra Fire Accident) జరిగింది. అహ్మద్ నగర్‌ (Ahmednagar)లోని సివిల్ ఆస్పత్రిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఐసీయూ వార్డులోనే ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో కాలిపోయి కొందరు.. దట్టమైన పొగలతో ఊపిరాడక మరికొందరు మరణించారు. ఇప్పటి వరకు 10 మంది కోవిడ్ రోగులు మరణించినట్లు అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోస్లే తెలిపారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వేరొక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఐసీయూ వార్డులో మొత్తం 25 మంది పేషెంట్లు ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై కొందరిని వేరొక ఫ్లోర్‌కు షిప్ట్ చేశారు.  అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

India Corona Cases: గుడ్ న్యూస్.. 10వేలకు తగ్గిన రోజువారీ కేసులు.. తాజా  బులెటిన్ ఇదే

ప్రతి పెద్దాస్పత్రిలో ఖచ్చితంగా అగ్ని నివారణ వ్యవస్థ ఉంటుంది. ఈ ఆస్పత్రిలో అగ్ని నివారణ వ్యవస్థ యాక్టివేట్ అయిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ యాక్టివేట్ అయితే మంటలు ఎందుకు వ్యాపించాయి? యాక్టివేట్ కాకుంటే ఎందుకు కాలేదు? దానికి బాధ్యులెవరు? అనే దానిపై విచారణ జరగాల్సి ఉందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి అమిత్ షా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Petrol Price: బిగ్ షాక్ తప్పదా..? లీటరు పెట్రోల్ ధర 200 రూపాయలు దాటుతుందా..?

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరగడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఇలాంటి ఘోరమే జరిగింది. పాల్ఘర్ జిల్లా విరార్‌లోని విజయ్‌ వల్లభ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి 14 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

First published:

Tags: Fire Accident, Maharashtra

ఉత్తమ కథలు