అహ్మదాబాద్ యువకుల అద్భుతం... పెద్ద ఫ్రెంచ్ ఫ్రైస్‌తో గిన్నీస్ రికార్డు

వీరు తయారు చేసిన ఫ్రెంచ్ ఫ్రై పొడవెంతో తెలుసా 9.5 అడుగులు. బరువు 659 కిలోలు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 6, 2019, 10:11 AM IST
అహ్మదాబాద్ యువకుల అద్భుతం... పెద్ద ఫ్రెంచ్ ఫ్రైస్‌తో గిన్నీస్ రికార్డు
పెద్ద ఫ్రెంచ్ ఫ్రైస్‌తో గిన్నీస్ రికార్డ్
  • Share this:
ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టపడని వారుండరు. పిల్లలతో పాటు చాలామంది పెద్దలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అలాంటి ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీలో ఇద్దరు యువకులు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ స‌‌ృష్టించారు. సాధారణంగా ఫ్రెంచ్ ఫ్రై.. మన చిటికిన వేలంతో... చూపుడు వేలంతో ఉంటుంది. కానీ ఈ యువకులు మాత్రం అతి పెద్ద పొడవైన ఫ్రెంచ్ ఫ్రైను తయారు చేసి రికార్డు సృష్టించారు.

పెద్ద ఫ్రెంచ్ ఫ్రైస్‌తో గిన్నీస్ రికార్డ్


అహ్మదాబాద్‌కు చెందిన చంద్రశేక్ బైడ్ . అర్పిత్ మెహత అతిపెద్ద ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేశారు. గతేడాది సెప్టెంబర్ 22న ఇద్దరు కలిసి ఈ అతిపెద్ద టెస్టీ ఫుడ్‌ను తయారు చేశారు. వీరు తయారు చేసిన ఫ్రెంచ్ ఫ్రై పొడవెంతో తెలుసా 9.5 అడుగులు. బరువు 659 కిలోలు.
ఈ 659 కిలోల ఫ్రెంచ్ ఫ్రైను తయారు చేసేందుకు కేవలం బంగాళ దుంపలు, ఆయిల్ మాత్రమే వాడారు. సుమారు 6 గంటలు శ్రమించి దీన్ని తయారు చేశారు. దీని కోసం 2200 కిలో బంగాళ దుంపలు, 540 లీటర్ల ఆయిల్‌ను వాడారు.

దీంతో వీరు తయారు చేసిన ఫ్రెంచ్ ఫ్రై గిన్నీస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. ఫిబ్రవరి 5వ తేదీని ఈ ఇద్దరి యువకుల్ని కలిసిన గిన్నీస్ ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. అహ్మదాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ చేతుల మీదుగా గిన్నీస్ అవార్డును అందచేశారు.
తాజగా తయారు చేసిన 659 కిలోల ఫ్రెంచ్ ఫ్రై 2014 అమెరికాలో తయారు చేసిన ఫ్రెచ్ ఫ్రై గిన్నీస్ రికార్డును దాటేసింది.
First published: February 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు