Bullet Train: జెట్ స్పీడ్‌లో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్.. టికెట్ ధర ఎంతంటే..

2023 డిసెంబరు లోపు ప్రాజెక్టును పూర్తిచేయానలి కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

news18-telugu
Updated: September 12, 2019, 10:42 PM IST
Bullet Train: జెట్ స్పీడ్‌లో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్.. టికెట్ ధర ఎంతంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వివరాలను నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) మీడియాకు వెల్లడించింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య తిరిగే బుల్లెట్ ట్రైన్ 2023లో పట్టాలెక్కుతుందని NHSRCL ఎండీ అచల్ ఖరే తెలిపారు. నిర్దేశిత గడువు (2023 డిసెంబరు)ను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ముంబై-గుజరాత్ మధ్య 35 ట్రిప్పులు (అప్ అండ్ డౌన్ కలిపి 70) తిరుగుతుంది. ఇక టికెట్ ధరను ప్రాథమికంగా రూ.3వేలుగా నిర్ణయించారు.

ప్రాజెక్టు వివరాలు:

గుజరాత్, మహారాష్ట్రతో పాటు దాద్రా, నగర్ హైవేలీ కేంద్రపాలిత ప్రాంతంలో ఈ బుల్లెట్ రైలు నడుస్తుంది.

508 కిలోమీటర్ల ఈ రైలు మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి.

థానె, విరార్, బాయ్సర్, వాపి, బిలిమోరా, సూరత్, భారుచ్, వడోదరా, ఆనంద్/నదియాద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్లలో రైలు ఆగుతుంది.

ఈ ప్రాజెక్టుకు 1,380 హెక్టార్ల భూసేకరణ అవసరం ఉండగా ఇప్పటి వరకు 622 హెక్టార్లు సేకరించారు.

ముంబై-అహ్మదాబాద్ భూసేకరణకు రూ.17,000 కోట్లు వ్యయం అవుతాయని అంచనా వేస్తున్నారు.బుల్లెట్ ప్రాజెక్టుకు 1380 హెక్టార్ల భూమి అవసరం ఉండగా ఇప్పటి వరకు 622 హెక్టార్లు సేకరించారు.

ప్రాజెక్టుకు అయ్యే మొత్తం అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు.

మొత్తం 27 ప్యాకేజీలుగా విభజన. సముద్రమార్గంతో కలిపి మొత్తం నాలుగు ప్యాకేజీలకు టెండర్ల జారీ.

2023 డిసెంబరు లోపు ప్రాజెక్టును పూర్తిచేయానలి కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading