హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

13th Floor Fear: 13వ అంతస్తు లేకుండానే భవనాల నిర్మాణం.. జనాల భయమే కారణమా ?

13th Floor Fear: 13వ అంతస్తు లేకుండానే భవనాల నిర్మాణం.. జనాల భయమే కారణమా ?

13th Floor Fear: 13వ అంతస్తు లేకుండానే భవనాల నిర్మాణం.. జనాల భయమే కారణమా ?

13th Floor Fear: 13వ అంతస్తు లేకుండానే భవనాల నిర్మాణం.. జనాల భయమే కారణమా ?

13th Floor Fear: చాలా ఏళ్ల క్రితం నుంచే పదమూడవ అంతస్తు/రూమ్ అంటే జనాల్లో ఒక రకమైన భయం ఉంది. ఈ అంతస్తులో నివసిస్తే తప్పనిసరిగా ఏదో ఒక కీడు జరుగుతుందని, దురదృష్టం వెంటాడుతుందని ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. అయితే ఈ సమస్యకు తాజాగా అహ్మదాబాద్ బిల్డర్లు కొత్త పరిష్కారం కనిపెట్టవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారతీయులు కొత్త ఇల్లు (New House)ను కొనుగోలు చేసేటప్పుడు వాస్తు (Vastu), న్యూమరాలజీ (Numerology) వంటి చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఎవరికి వారు తమ సెంటిమెంట్స్‌కి అనుగుణంగా ఇల్లు ఉంటేనే దానిని కొనుగోలు చేస్తారు. అయితే చాలా ఏళ్ల క్రితం నుంచే పదమూడవ అంతస్తు/రూమ్ అంటే జనాల్లో ఒక రకమైన భయం ఉంది. ఈ అంతస్తులో నివసిస్తే తప్పనిసరిగా ఏదో ఒక కీడు జరుగుతుందని, దురదృష్టం వెంటాడుతుందని ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. అందుకే ఇప్పటికీ చాలామంది 13వ అంతస్తులో (13th Floor) ఇల్లు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీనివల్ల ఆ ఫ్లోర్‌లోని గదులను జనాలకు అంటగట్టడం బిల్డర్ల తరం కావడం లేదు. అయితే ఈ సమస్యకు తాజాగా అహ్మదాబాద్ బిల్డర్లు కొత్త పరిష్కారం కనిపెట్టారు. వీరు తమ భవంతులను 13వ అంతస్తు లేకుండానే నిర్మిస్తున్నారు.

సాధారణంగా 13 అనగానే భయం మొదలైతే దానిని ట్రిస్కైడెకాఫోబియా (Triskaidekaphobia)గా వ్యవహరిస్తారు. ఈ ట్రిస్కైడెకాఫోబియా చాలా మందిలో ఉంది. అందుకే అహ్మదాబాద్ (Ahmedabad) హౌస్ డెవలపర్లు తమ ప్రాజెక్ట్‌లలో 12వ అంతస్తు తర్వాత నేరుగా 14వ అంతస్తును కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి న్యూమరాలజీపై నమ్మకం లేకపోయినా కొనుగోలుదారుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాస్తవానికి, ఇప్పటికే చాలా మంది బిల్డర్లు 12వ అంతస్తు తర్వాత పదమూడవ అంతస్తుగా పేరు పెట్టకుండా వేరే నంబర్‌ని కేటాయించడం జరిగింది. ఇదే ట్రెండ్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ రియల్టర్లు కూడా ఫాలో అవుతున్నారు.

అహ్మదాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్ యష్ షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. "మేం 12 అంతస్తుల కంటే ఎత్తైన ఏడు ప్రాజెక్టులు నిర్మించాం. వాటిలో మూడు కమర్షియల్, మూడు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఆరింటిలో ఫ్లోర్ 13 లేదు.

ఎందుకంటే 13 నంబర్ గల ప్లేస్ చాలా తక్కువ ధరకు మాత్రమే అమ్ముడవుతుంది లేదా దానిని చాలా తక్కువ రెంట్‌కి మాత్రమే తీసుకోవడానికి ప్రజల ముందుకు వస్తున్నారు." అని పేర్కొన్నారు. ఈ ట్రెండ్ ఇప్పటికే ఉన్న, భవిష్యత్‌లో నిర్మించనున్న భవనాలకు కూడా వర్తిస్తుంది. అంతస్తు నంబర్ 13, ఆఫీస్ నంబర్ 13 లేదా దక్షిణం వైపు ఉన్న ఆస్తికి సాధారణంగా ఎక్కువ వ్యాల్యూ ఉండదని మరో అధికారి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : పోస్టాఫీస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రెండేళ్ల తర్వాత పెరిగిన వడ్డీ రేట్లు..

* భవిష్యత్తులో ఇదొక ట్రెండ్

ఇక అహ్మదాబాద్, గాంధీనగర్‌లోని కొన్ని ప్రాంతాలలో హయ్యర్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌తో 2027 నాటికి 30-40 అంతస్తుల వరకు అనేక ఎత్తైన భవన నిర్మాణాలు రానున్నాయి. వీటిలో చాలా వాటిలో 13వ నంబర్ గల అంతస్తు కనిపించకపోవచ్చు. అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (IFSC) సమీపంలోని GIFT సిటీ క్యాంపస్‌లో రాబోయే 33-అంతస్తుల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో కూడా ఫ్లోర్ నంబర్ 13 కనిపించదు.

ఇతర దేశాల్లో 13వ అంతస్తుకు 13వ అంతస్తు అనే పేరు పెట్టకుండా 12A లేదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌లో పదమూడవ లెటర్ అయిన 'M' అని పెట్టడం ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారు. చైనాలో 14 అనే ప్రొనౌన్షియేషన్/ ఉచ్చారణ మరణం అనే పదం లాగా వినిపిస్తుంది. అందుకే వీరు ఎక్కువగా 13, 14 ఫ్లోర్స్‌ లేవనట్లు 12వ అంతస్తు తర్వాత డైరెక్ట్‌గా 15వ అంతస్తు అని పేర్లు పెడుతుంటారు. బిల్డర్లు 13వ అంతస్తు మాత్రమే కాదు 13వ రూమ్ నంబర్ లేకుండా కూడా జాగ్రత్తపడతారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Ahmedabad, Gujarat, National News

ఉత్తమ కథలు