ప్రణబ్- ఆర్‌ఎస్ఎస్ మీటింగ్‌పై కాంగ్రెస్ అభ్యంతరం..!

Shiva Kumar Addula | news18
Updated: June 7, 2018, 12:33 PM IST
ప్రణబ్- ఆర్‌ఎస్ఎస్ మీటింగ్‌పై కాంగ్రెస్ అభ్యంతరం..!
ప్రణబ్ ముఖర్జీ (ఫైల్ ఫొటో)
  • News18
  • Last Updated: June 7, 2018, 12:33 PM IST
  • Share this:
నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా  జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఐతే ఆయన ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరుకానుండడంపై కొంతకాలంగా దుమారం రేగుతోంది. ఆ సమావేశానికి వెళ్లకూడదని కాంగ్రెస్ నేతలు ఆయనకు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఆర్ఎస్ఎస్ సమావేశానికి ప్రణబ్ వెళ్తారనుకోలేదని బుధవారం ట్విటర్‌ ద్వారా తెలిపారు.అంతకుముందు ప్రణబ్ కూతురు, కాంగ్రెస్ నేత షర్మిష్ఠ ముఖర్జీ కూడా ఇదే అభిప్రాయాన్నివెల్లడించారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లవద్దని ట్విటర్ వేదికగా విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మీరు నాగ్‌పూర్‌కు వెళ్లడం ద్వారా తప్పుడు ప్రచారం చేసేందుకు బీజేపీకి,  సంఘ్‌కు అవకాశమిచ్చినట్లయింది. మీరు చేసే ప్రసంగాన్నికొంత కాలం తర్వాత అందరూ మరిచిపోతారు. కానీ ఆ సమావేశానికి హాజరైన ద‌ృశ్యాలు ఎప్పటికీ ఉంటాయి. తప్పుడు స్టేట్‌మెంట్లతో వాటిని దుష్ప్రచారం చేస్తారు.
షర్మిష్ఠ ముఖర్జీ


ఐతే ఆమె ఇలా మాట్లాడడానికి బలమైన కారణమే ఉంది. ప్రణబ్ ముఖర్జీ నాగపూర్ పర్యటన నేపథ్యంలో ఆయన కూతరు షర్మిష్ఠ బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. దీనిపై షర్మిష్ఠ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ డర్టీ ట్రిక్స్ డిపార్ట్‌మెంటే తప్పుడు ప్రచారం చేసిందని ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు.పర్వతప్రాంతంలో సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా తప్పుడు వార్త వినిపించింది. బీజేపీలో చేరబోతున్నాన్న ప్రచారం టార్పిడోలా దాడి చేసింది. కాంగ్రెస్ పట్ల నాకు విశ్వాసమున్నందుకే పార్టీల చేరాను. పార్టీ మారడం కన్నా రాజకీయాల నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావిస్తాను.
షర్మిష్ఠ ముఖర్జీ


కాగా, ప్రణబ్ ఆర్ఎస్ఎస్ మీటింగ్‌కు వెళ్లడంపై  జైరాం రమేశ్, చిదంబరం సహా పలువురు నేతలు అసంత‌ృప్తి వ్యక్తం చేశారు. ఐతే వాటిపై తనదైన శైలిలో స్పందించారు ప్రణబ్. తాను చెప్పాలనుకున్న అంశాలన్నీ నాగ్‌పూర్ వేదికగానే చెబుతాని.. అప్పటి వరకూ ఎదురుచూడాలని చెప్పుకొచ్చారు. దాంతో ఇవాళ సాయంత్రం ఆయన ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది.
Published by: Shiva Kumar Addula
First published: June 7, 2018, 12:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading