Samantha Cristoforetti Wishes To India : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశావ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్(Azadi Ka Amruth Mahostav)పేరుతో కేంద్రం ఉత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్వతంత్ర భారత దేశ వజ్రోత్సవాల సందర్భంగా అంతరిక్షం నుంచి శుభాకాంక్షల సందేశం వచ్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(International Space Station)లో పని చేస్తున్నభారత మూలాలున్న ఇటాలియన్ ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫొరెట్టి (Samantha Cristoforetti) 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న భారత్ కు శుభాకాంక్షలు చెబుతూ ఒక వీడియో మెసేజ్ పంపారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్‌కు ఓవీడియో సందేశం పంపించారు.
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇతర సంస్థల తరపున భారత్ కు శుభాకాంక్షలు చెబుతున్నట్లు సమంత ఆ వీడియో సందేశంలో తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో భారత దేశాన్ని అభినందించడం హర్షణీయమని అన్నారు. అంతర్జాతీయ సంస్థలు చాలా దశాబ్దాలుగా అనేక రోదసి, సైన్స్ మిషన్స్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)తో కలిసి పని చేస్తున్నాయని సమంత అన్నారు.
POK : పాక్ నిర్ణయానికి వ్యతిరేకంగా పీఓకేలో పెద్ద ఎత్తున నిరసనలు!
2023లో అంతరిక్షంలోకి మానవులను పంపేందుకు ఇస్రో(ISRO)చేపట్టనున్న గగన్‌యాన్ కార్యక్రమం విజయవంతం కావాలని సమంత ఆకాంక్షించారు. ఇస్రో చేపట్టిన నిసార్ ఎర్త్ సైన్స్ మిషన్ గురించి కూడా ప్రస్తావించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, భూమిపై విపత్తులను గుర్తించడానికి దోహదపడే నిసార్ ఎర్త్ సైన్స్ మిషన్‌ను అభివృద్ధి చేయడం కోసం ఇస్రో కృషి చేస్తోందన్నారు. నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ మిషన్ (NISAR)ను భారత, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. మరోవైపు ఈ వీడియో మెసేజ్‌పై ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. నాసాతోపాటు ఇతర సంస్థలకు ఓ ట్విట్ లో థాంక్స్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.