బడ్జెట్ లేదని.. 25 వేల మంది హోంగార్డుల తొలగింపు..

దీపావళి ముందు యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ లేదన్న కారణంతో 25 వేల మంది హోంగార్డుల పోస్టింగులను తొలగించింది. పోలీస్ స్టేషన్లలో, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఉంటున్న వీరికి యోగి సర్కార్ గుడ్‌బై చెప్పింది.

news18-telugu
Updated: October 15, 2019, 1:12 PM IST
బడ్జెట్ లేదని.. 25 వేల మంది హోంగార్డుల తొలగింపు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 15, 2019, 1:12 PM IST
దీపావళి ముందు యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ లేదన్న కారణంతో 25 వేల మంది హోంగార్డుల పోస్టింగులను తొలగించింది. పోలీస్ స్టేషన్లలో, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఉంటున్న వీరికి యోగి సర్కార్ గుడ్‌బై చెప్పింది. అదీకాక.. 99 వేల మంది హోంగార్డులు నెలలో దాదాపు సగం రోజుల పాటు ఉపాధి కోల్పోనున్నారు. వారికి కేవలం 15 రోజుల పాటు ఉపాధి కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. పోలీస్ కానిస్టేబుళ్లకు అందజేస్తున్నట్లుగానే హోంగార్డులకు కూడా డైలీ అలవెన్స్(డీఏ) అందజేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ఆ భత్యం ప్రభుత్వానికి భారం కావడంతో వీరిని తొలగించుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. ‘హోంగార్డులకు డైలీ అలవెన్సులు చెల్లిస్తే ప్రభుత్వ నిధికి భారీగా గండి పడుతుంది. దీపావళి ముందు ఈ నిర్ణయం తీసుకుంటున్నా.. తప్పనిసరి’ అని తెలిపారు.

కాగా, అక్టోబరు 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 25 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. దీనిపై ఆగస్టు 28న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఆశ్చర్యకర విషయమేమిటంటే.. గత ఏడాదే వీరిని నియమించుకుంది. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నియమించుకున్నా.. ఇప్పుడు వారిని తొలగిస్తుండటం గమనార్హం.

వాస్తవానికి హోంగార్డులు డైలీ అలవెన్సు కింద రూ.500 పొందేవారు. అయితే సుప్రీం కోర్టు తీర్పుతో ఆ మొత్తం రూ.672కు చేరింది. ఆ భారం పోలీస్ శాఖ బడ్జెట్‌పై పడింది. దాంతో వారికి స్వస్తి పలికారు. కాగా, హోంగార్డులకు ఫిక్స్‌డ్ జీతం అంటూ లేదు. నెలకు 25 రోజుల పాటు పనిచేస్తే ఆ పని దినాలకు మాత్రమే డైలీ అలవెన్సు చెల్లించేవారు. ఇప్పుడు 99వేల మంది హోంగార్డుల పనిదినాలు 15 రోజులకు కుదించడంతో వారు సగం జీతమే అందుకోనున్నారు.

First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...