హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ayodhya Verdict: ఫేస్‌బుక్‌లో అయోధ్య అంశంపై అభ్యంతరకరమైన పోస్ట్... ఓ వ్యక్తి అరెస్ట్

Ayodhya Verdict: ఫేస్‌బుక్‌లో అయోధ్య అంశంపై అభ్యంతరకరమైన పోస్ట్... ఓ వ్యక్తి అరెస్ట్

Ayodhya Verdict: ఫేస్‌బుక్‌లో అయోధ్య అంశంపై అభ్యంతరకరమైన పోస్ట్... ఓ వ్యక్తి అరెస్ట్
(ప్రతీకాత్మక చిత్రం, image: News18 Creative)

Ayodhya Verdict: ఫేస్‌బుక్‌లో అయోధ్య అంశంపై అభ్యంతరకరమైన పోస్ట్... ఓ వ్యక్తి అరెస్ట్ (ప్రతీకాత్మక చిత్రం, image: News18 Creative)

Ayodhya Verdict | ఫేస్‌బుక్‌లో అయోధ్య అంశంపై అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టిన వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులు అతడి ఫేస్‌బుక్ పోస్ట్‌ను పరిశీలించి అభ్యంతరకమైనదిగా తేల్చారు.

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసులు నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. అయోధ్య అంశంపై ఓ వ్యక్తి అభ్యంతరకరమైన పోస్ట్ రాయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ధూలెలో జరిగింది ఈ ఘటన. సున్నితమైన అంశం కాబట్టి ఇప్పటికే పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు ప్రచారం జరుగుతాయన్న అనుమానంతో నిఘా కూడా పెంచారు. ధూలెలోని ఓల్డ్ ఆగ్రా రోడ్‌లో నివాసం ఉండే 56 ఏళ్ల సంజయ్ రామేశ్వర్ శర్మ ఫేస్‌బుక్‌లో అయోధ్య అంశంపై అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టిన వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులు అతడి ఫేస్‌బుక్ పోస్ట్‌ను పరిశీలించి అభ్యంతరకమైనదిగా తేల్చారు. అతడిని అరెస్ట్ చేశారు.

సంజయ్ రామేశ్వర్ శర్మపై సెక్షన్ 153 (1) (బీ), ఐపీసీ 188 కింద కేసులు పెట్టారు. అతడిని ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. సంజయ్ రామేశ్వర్ శర్మను పోలీసులు అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గత మూడు నెలల్లో రెండు కేసుల్లో అరెస్ట్ చేశారు. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పు రానుండటంతో అన్ని రాష్ట్రాల పోలీసులు సోషల్ మీడియాపై నిఘా పెట్టారు. ఎవరైనా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినా, షేర్ చేసినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కేసుల్లో ఇరుక్కోవడం ఖాయం.

Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Ayodhya Verdict: యూపీలో ఇంటర్నెట్ సేవలు బంద్... తాత్కాలిక జైళ్ల ఏర్పాటు

Aadhaar-SBI link: మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయలేదా? ఇలా చేయండి

TSSPDCL: తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి

First published:

Tags: Ayodhya, Ayodhya Dispute, Ayodhya Ram Mandir, Ayodhya Verdict

ఉత్తమ కథలు