ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథ్ సతీమణి, విద్యారంగ నిపుణురాలైన మీనా స్వామినాథన్ ఇకలేరు. చెన్నైలోని నివాసంలో సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. వృద్దాప్యం కారణంగా 88 ఏళ్ల వయసులో సహజంగానే మరణించినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. మీనా స్వామినాథన్ శిశు విద్యా రంగంలో నిపుణురాలు. యాక్టివిస్ట్ కూడా. లింగ సమానత్వం కోసం సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఎంఎస్ స్వామినాథన్ రీసర్చ్ ఫౌండేషన్ చైర్మెన్‌గా కూడా మీనా ఉన్నారు.
మీనా స్వామినాథన్ సహజంగానే ఆమె మరణించినట్లు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. టీచర్‌గా, ఎడ్యుకేటర్‌గా, రైటర్‌గా ఆమెకు గుర్తింపు ఉన్నది. చిన్నపిల్లల విద్యకు సంబంధించిన అనేక పుస్తకాలు రాశారు. కేంద్ర విద్యా బోర్డు అడ్వైజరీగా ఆమెను 1970లో నియమించారు. ఆమె సమర్పించిన రిపోర్ట్ ఆధారంగానే 1975లో ఐసీడీఎస్‌ను అమలు చేశారు. టీచర్ల శిక్షణ కోసం మూడు మాన్యువల్స్‌ను ఆమె రాశారు.
సెంటర్ ఫర్ వుమెన్స్ డెవలప్మెంట్ స్టడీస్ ఏర్పాటులో మీనా స్వామినాథన్ వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్నారు. మీనా స్వామినాథన్ -ఎంఎస్ స్వామినాథన్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టుగా పనిచేస్తోన్న సౌమ్యా స్వామినాథన్ , ఎనకామిక్స్ ప్రొఫెసర్ మధుర స్వామినాథన్, బ్రిటన్‌లోని ఈస్ట్ అంగ్లియా వర్సిటీ డైరెక్టర్ నిత్యా రావు వీరి సంతానమే.
మీనా స్వామినాథన్ మృతి పట్ల జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేరుగా స్వామినాథన్ రీసెర్చ్ సెంటర్ కు వెళ్లి మీనా పార్థివదేహానికి నివాళి అర్పించారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఇప్పటికీ నిత్య చర్చగా ఉంటోన్న సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.