Farmers Protest: రైతుల ఆందోళనల్లో పిజ్జాలు, బిర్యానీలు.. వీడియోలు వైరల్

రైతులకు పిజ్జాల పంపిణీ

Farmers Protest: మరికొందరు మాత్రం రైతులకు మద్దతు తెలుపుతున్నారు. రైతులు ఎప్పుడూ పేదవారిగానే మిగిలిపోవాలా? వారు పిజ్జాలు, బర్గర్లు తినకూడదా? అని ప్రశ్నిస్తున్నారు.

  • Share this:
    ఢిల్లీలో రైతుల ఆందోళనలు 18 రోజులకు చేరుకున్నాయి. ఇవాళ జైపూర్-ఢిల్లీ హైవేను ట్రాక్టర్ల ర్యాలీతో బ్లాక్ చేశారు. రేపు సింఘు సరిహద్దులో నిరహారదీక్షకు దిగనున్నారు. డిసెంబరు 19 లోపు చట్టాలను రద్దు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని కేంద్రానికి డెడ్‌లైన్ విధించాయి. ఇప్పటికీ వేలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలో రోడ్లపైనే ఉన్నారు. అక్కడే తింటున్నారు. అక్కడే పడుకుంటున్నారు. ఐతే ఆందోళనల్లో పాల్గొన్న రైతులకు కొన్ని చోట్ల పిజ్జాలు, బిర్యానీలు సరఫరా చేస్తన్నారు. ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కొందరు అధునాతన సాధనాలతో ఫుట్ మసాజ్ చేసుకున్న ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఈ ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు రైతులెవరైనా పిజ్జాలు, బర్గర్లు తింటారా? కాళ్లకు మసాజ్‌లు చేసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉద్యమం ఖచ్చితంగా పక్కదారి పట్టిందని విమర్శిస్తున్నారు.



    అసలు ఇది నిరసన కార్యక్రమమా..? లేదంటే పిజ్జా పార్టీయా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


    మరికొందరు మాత్రం రైతులకు మద్దతు తెలుపుతున్నారు. రైతులు ఎప్పుడూ పేదవారిగానే మిగిలిపోవాలా? వారు పిజ్జాలు, బర్గర్లు తినకూడదా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎలుకలు తిని నిరసన వ్యక్తం చేసినప్పుడు స్పందించని నోళ్లు.. ఇప్పుడు ఎందుకు మొరుగుతున్నాయ్.. అని మండిపడుతున్నారు. రైతుల డిమాండ్లను పట్టించుకోకుడా.. వారు అది తింటున్నారు..ఇలా బట్టలు వేసుకున్నారు.. అని అనుమానించడం ఏంటి..? అని విరుచుకుపడుతున్నారు.


    రైతుల సంఘాలు, కేంద్రం మధ్య ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు. కేంద్రం చెప్పిన ఏ ప్రతిపాదనకూ రైతులు అంగీకరించడం లేదు. మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఆ మూడు చట్టాలను రద్దుచేసే ప్రకస్తే లేదని తేల్చిచెప్పింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికే చట్టాలను తెచ్చామని.. అపోహలతో ఆందోళనలు చేయడం సరికాదని సూచిస్తోంది. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే రైతులను వాడుకుంటున్నాయని.. వారి ఉచ్చులో పడ వద్దని రైతులకు కేంద్రమంత్రులు సూచిస్తున్నారు. రైతుల ఆందోళనల్లోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని విమర్శిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: