Home /News /national /

AGRICULTURE BILLS OPPOSITION MPS THROWS RULE BOOK ON DY CHAIRMAN PODIUM SK

Agriculture Bills: రాజ్యసభలో రచ్చ.. డిప్యూటీ ఛైర్మన్‌పై రూల్ బుక్ విసిరేసిన ఎంపీలు

రాజ్యసభలో రచ్చ.. డిప్యూటీ ఛైర్మన్‌పై రూల్ బుక్ విసిరేసిన ఎంపీలు

రాజ్యసభలో రచ్చ.. డిప్యూటీ ఛైర్మన్‌పై రూల్ బుక్ విసిరేసిన ఎంపీలు

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ వెల్‌లోకి వెళ్లి డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌ ముందు రూల్ బుక్ ప్రదర్శించారు. మరో ఎంపీ రూల్ బుక్ విసిరేస్తే డిప్యూటీ ఛైర్మన్‌ మైక్‌పడి పడింది.

    వ్యవసాయ బిల్లులపై తీవ్ర దుమారం రేగుతోంది. అనుకున్నట్లుగా రాజ్యసభలో రచ్చ రచ్చ జరిగింది. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సభలో బిల్లులను ప్రవేశపెట్టిన వెంటనే విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. రైతులకు నష్టం చేకూర్చి కార్పొరేట్లకు లాభం కలిగించే ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు, శివసేన, వైసీపీ మాత్రమే మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్‌, టీఆర్ఎస్, అన్నాడీఎంకే, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, ఆమాద్మీ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. బిల్లులుపై సభ్యులు మాట్లాడుతున్న సమయంలో కొందరు విపక్షాల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు.

    తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ వెల్‌లోకి వెళ్లి డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌ ముందు రూల్ బుక్ ప్రదర్శించారు. మరో ఎంపీ రూల్ బుక్ విసిరేస్తే డిప్యూటీ ఛైర్మన్‌ మైక్‌పడి పడింది. కరోనా సమయంలో ఇలా వెల్‌లోకి రావడం మంచిది కాదని.. అందరూ తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఎంపీలు వినలేదు. గందరగోళం మధ్య సభను కాసేపు వాయిదా వేశారు డిప్యూటీ ఛైర్మన్. అంతకుముందు దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనపై కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ వాయిదా తీర్మానం ఇచ్చారు. బిల్లును ఇంత హడావిడిగా పాస్ చేయాల్సిన అవసరం ఏముందని.. సెలెక్ట్ కమిటీకి పంపాలని ఎంపీలు డిమాండ్ చేశారు.

    వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను సెప్టెంబర్ 14న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020ను మూజువాణి ఓటుతో ఈ నెల 17న లోక్‌సభ ఆమోదించింది. ఇక తృణధాన్యాలు, పప్పులు, ఉల్లిపై నియంత్రణ ఎత్తివేసే.. నిత్యవసర ఉత్పత్తుల (సవరణ) బిల్లు-2020ను మంగళవారం ఈనెల 15న ఆమోదించింది. ఈ సంస్కరణలు రైతులకు లాభదాయకంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతుంటే.. విపక్షాలు మాత్రం రైతులకు నష్టం జరుగుతుందని మండిపడుతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Agriculture, Farmer, Farmers Protest, Rajyasabha

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు