హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Agri Acts: సాగు చట్టాలు, రైతుల ఆందోళనలపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక వ్యాఖ్యలు

Agri Acts: సాగు చట్టాలు, రైతుల ఆందోళనలపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక వ్యాఖ్యలు

సాగు చట్టాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. అంతమాత్రాన అందులో లోపాలు ఉన్నట్లు భావించకూడదని వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఇంకా చదవండి ...

  సాగు చట్టాలపై ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.  పార్లమెంట్‌లో విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు విదేశీ ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. అంతమాత్రాన అందులో లోపాలు ఉన్నట్లు భావించకూడదని అన్నారు. వ్యవసాయ చట్టాలపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంగా నేడు నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో మాట్లాడారు.

  ''రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే మా లక్ష్యం. జీడీపీ వృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర పెరుగుతోంది.  ఆ దిశగానే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చాం. రైతుల సంక్షేమానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని మరోసారి చెబుతున్నా.  కొన్ని రైతు సంఘాలు, విపక్షాలు సాగు చట్టాలను నల్లచట్టాలుగా పేర్కొంటున్నాయి. అందులో నలుపు ఏముందని నేను అడుగుతున్నా. వాళ్లు చెబితే మేం సరిచేస్తాం. చట్టాల్లో ఎక్కడా పొరపాట్లు లేవు. కానీ రైతుల ఆందోళనల్లోనే పొరపాట్లు కనిపిస్తున్నాయి.'' అని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.

  ''కొత్త చట్టాలు అమలైతే మీ భూములు లాక్కుంటారంటూ కొందరు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారిని కావాలనే రెచ్చగొడుతున్నారు. ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి చెందిన రైతులను రెచ్చగొడుతున్నారు. ఒప్పంద వ్యవసాయ చట్టం ద్వారా రైతుల భూములు దోపిడీకి గురవుతాయని చెప్పేలా ఒక్క నిబంధన అయినా చట్టంలో ఉందా? చూపించండి. ''అని నరేంద్ర సింత్ తోమర్ తెలిపారు.

  ;

  పంటలకు ఉత్పత్తి ఖర్చుల కంటే కనీసం 50 శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర కల్పిస్తున్నామని నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక అవసరాల కోసం రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించామని అన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడుల పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన వెల్లడించారు. పండ్లు, కూరగాయాలను రైళ్లలో తరలిస్తామని ఎప్పుడైనా అనుకున్నామా... అందుకోసం 100 కిసాన్ రైళ్లు నడుస్తున్నాయని వ్యవసాయమంత్రి తెలిపారు.

  మరోవైపు ఢిల్లీలో శివార్లలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. 11 దఫాలు చర్చలు జరిపినా.. స్పందించడం లేదని రైతులు సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. అన్ని చోట్ల రాస్తారోకోలు చేపడతామని స్పష్టం చేశారు. ఐతే జనవరి 16న ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు ఈసారి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

  First published:

  Tags: Agriculture, Delhi, Farmers Protest, Indian parliament, New Agriculture Acts, Rajyasabha

  ఉత్తమ కథలు