హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Yogi To News 18 : భారతీయ ముస్లింలపై ఆ వ్యాఖ్యలు సమర్థిస్తున్నా..న్యూస్ 18 ఇంటర్వ్యూలో సీఎం యోగి

Yogi To News 18 : భారతీయ ముస్లింలపై ఆ వ్యాఖ్యలు సమర్థిస్తున్నా..న్యూస్ 18 ఇంటర్వ్యూలో సీఎం యోగి

స్యూస్ 18 ఇంటర్వ్యూలో సీఎం యోగి

స్యూస్ 18 ఇంటర్వ్యూలో సీఎం యోగి

Yogi Adityanath On Indian Muslims : ఇవాళ(ఫిబ్రవరి-5,2023)ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Yogi Adityanath On Indian Muslims : ఇవాళ(ఫిబ్రవరి-5,2023)ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు. భారతీయ ముస్లింలపై(Indian Muslims) ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat)ఇటీవల చేసిన ప్రకటనలతో ఏకీభవిస్తున్నట్లు సీఎం యోగి ఇంటర్వ్యూలో తెలిపారు. భారతదేశంలో ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే వారు తమ ఆధిపత్యం యొక్క బూటకపు వాక్చాతుర్యాన్ని విడిచిపెట్టాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఇటీవల చేసిన ప్రకటనపై అడిగినప్పుడు..ఆ ప్రకటనతో ఏకీభవిస్తున్నట్లు యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేవలం పాలన ద్వారా మాత్రమే కమ్యూనిటీలను చేరుకోగలవని, సంక్షేమ పథకాలను ప్లాన్ చేసేటప్పుడు తమ ప్రభుత్వం లబ్ధిదారుల వర్గాలను "ఎంచుకోవడం మరియు ఎన్నుకోవడం(Pick and Choose)"అనే పద్దతిని అవలంభించదని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు, మెరుగైన పాలన అన్ని వర్గాలకు సహాయపడిందన్నారు. అన్ని మతాల పండుగలను శాంతియుతంగా నిర్వహించబడుతున్నాయన్నారు. హిందూ బాలికలు సురక్షితంగా ఉంటే, ముస్లిం బాలికలు కూడా సురక్షితంగా ఉన్నారన్నారు. తమ ప్రభుత్వ పథకాలన్నీ ముస్లింలతో సహా ప్రతి వ్యక్తికి ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. తాము ఎలాంటి బుజ్జగింపు రాజకీయాలు చేయమని సృష్టం చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని యూపీ సీఎం అంచనా వేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 6 ఏళ్లలో 5 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. వచ్చే 2-4 ఏళ్లలో లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయన్నారు.

Yogi To News 18 : రామచరిత మానస్‌ వివాదం,భారత్ జోడో యాత్రపై యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు

 యూనిఫాం సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code)తీసుకురావడానికి ఉద్దేశించిన ప్రణాళికల గురించి అడిగిన ప్రశ్నకు...ప్రతి రాష్ట్రం తమలాగే ప్యానెల్‌లను ఏర్పాటు చేసిందని..ఈ అంశంపై ఏకాభిప్రాయం తర్వాత ఒక నిర్ధారణకు వస్తాం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  అన్నారు.  రాష్ట్ర న్యాయ కమిషన్ ఈ యూనిఫాం సివిల్ కోడ్ ని చూస్తోందని.. ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ చేసిన ఎన్నికల వాగ్దానాలలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు కూడా ఒకటి. అన్ని ప్రజాస్వామ్య చర్చలు ముగిసిన తర్వాత యూనిఫాం సివిల్ కోడ్ (UCC) తీసుకురావడానికి పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతేడాది నవంబర్‌లో చెప్పారు. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ ఏడాది ఫిబ్రవరి 2న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి సిఫార్సులు చేయాలని ప్రభుత్వం 21వ లా కమిషన్‌ను అభ్యర్థించిందని రిజిజు పార్లమెంట్ కు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

First published:

Tags: Uttarapradesh, Yogi adityanath

ఉత్తమ కథలు