హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Agnipath scheme:నాలుగేళ్లు ఆర్మీలో పనిచేసిన అగ్నివీరులకు ఉద్యోగాలిస్తాం..ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన

Agnipath scheme:నాలుగేళ్లు ఆర్మీలో పనిచేసిన అగ్నివీరులకు ఉద్యోగాలిస్తాం..ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన

ఆనంద్ మహీంద్రా(ఫైల్ ఫొటో)

ఆనంద్ మహీంద్రా(ఫైల్ ఫొటో)

Anand Mahindra promises to recruit Agniveers: భారత త్రివిధ దళాల్లోకి రెగ్యులర్ నియామకాలను రద్దుచేస్తూ, ఇకపై నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా కేంద్రం కొత్తగా ‘అగ్నిపథ్’ పథకాన్ని (Agnipath scheme) తీసుకొచ్చింది. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత తీవ్రస్థాయి నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...

Anand Mahindra promises to recruit Agniveers: భారత త్రివిధ దళాల్లోకి రెగ్యులర్ నియామకాలను రద్దుచేస్తూ, ఇకపై నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా కేంద్రం కొత్తగా ‘అగ్నిపథ్’ పథకాన్ని (Agnipath scheme) తీసుకొచ్చింది. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత తీవ్రస్థాయి నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద రిక్రూట్ అయినవారు నాలుగు సంవత్సరాల పాటు ఆర్మీ, నేవీ, వైమానిక దళంలో సేవలందిస్తారు. తర్వాత 25 శాతం మందిని రెగ్యులర్ విధుల్లోకి తీసుకుంటారు. అగ్నిపథ్ స్కీం ద్వారా ఆర్మీలో కేవలం నాలుగేళ్లు మాత్రమే సర్వీసులో ఉంటే ఆ తర్వాత ఏం చేయాలనే పెద్ద ప్రశ్నను లేవదీస్తూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఈ సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) కీలక ప్రకటన చేశారు. ఆర్మీలో నాలుగేళ్ల సర్వీస్ ఆనంతరం అగ్నివీర్‌లను తాము ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహీంద్రా ఈ విషయాన్ని వెల్లడించారు.

సోమవారం ఉదయం చేసిన ట్వీట్ లో ఆనంద్ మహీంద్రా..."అగ్నిపథ్ పథకానికి సంబంధించి దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం బాధ కలిగించింది.గత సంవత్సరం ఈ పథకం పరిగణలోకి తీసుకున్నప్పుడే నేను చెప్పాను. దాన్నే పునరావృతం చేస్తున్నాను. అగ్నివీర్స్ పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారిని ప్రముఖంగా ఉపాధి పొందేలా చేస్తాయి. మహీంద్రా గ్రూప్ అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకుంటది"అని తెలిపారు.


Kailash Vijayvargiya : బీజేపీ ఆఫీస్ సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీర్​లకే ప్రాధాన్యం..బీజేపీ కీలక నేత వ్యాఖ్యలపై విపక్షాలు పైర్

Inspiring : 10వ తరగతి ఫలితాల్లో ఇరగదీసిన చైల్డ్ బెగ్గర్..అగ్నిపథ్ ద్వారా సైన్యంలో చేరతాడంట

అగ్నిపథ్‌పై ఆందోళనలు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నా.. కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటోంది. అగ్నిపథ్‌ రద్దు చేయాలని యువకులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా.. పథకాన్ని కొనసాగించేందుకే కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆందోళనకారులను శాంతింపజేసేందుకు అగ్నివీర్‌లకు రాయితీలను కూడా ప్రకటించింది. రక్షణ మంత్రిత్వ శాఖలో 10 శాతం ఉద్యోగ ఖాళీలను అగ్నివీర్స్‌ కోసం కేటాయించనున్నారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్ రిక్రూట్‌మెంట్‌లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వయో పరిమితిని రెండేళ్ల పెంచింది. అంతేకాకుండా అసోం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరఖండ్, కర్నాటక వంటి రాష్ట్రాలు స్టేట్ ఉద్యోగాల్లో కూడా అగ్నివీర్లకు ప్రాధానం ఇస్తామని ప్రకటించాయి.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Agnipath Protest, Agnipath Scheme, Anand mahindra

ఉత్తమ కథలు