భారత త్రివిధ దళాల్లో తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్‌మెట్ (Agnnipath Scheme) పథకంపై దేశ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ.. కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. అగ్నివీరులుగా పనిచేసిన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో (Central Armed Police Forces) రిజర్వేషన్ కల్పిస్తామని హోంశాఖ కార్యాలయం (Home Ministry) శనివారం ప్రకటించింది. 'అగ్నిపథ్' కింద ఆర్మీకి ఎంపికై నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్‌లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించింది. ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ (Agniveer) తొలి బ్యాచ్ వారికి .. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
The Ministry of Home Affairs (MHA) decides to reserve 10% vacancies for recruitment in CAPFs and Assam Rifles for Agniveers.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 18, 2022
కేంద్ర సాయుధ పోలీసు బలగాలంటే.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమ బల్ (SSB), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG). ఈ బలగాలన్నీ కేంద్రహోంశాఖ పరిధిలోకి వస్తాయి. ఇక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు.. కేంద్ర రక్షణ శాఖ కింద ఉంటాయి. అగ్నిపథ్ స్కీమ్ కింద ఎంపికై.. నాలుగేళ్లు ఈ త్రివిధ దళాల్లో పనిచేసిన వారికి.. కేంద్ర సాయుధ బలగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. అంటే ఈ విభాగాల్లో 10 శాతం పోస్టులను అగ్నివీరులకు కేటాయిస్తారు. గరిష్ట వయో పరిమితిని మూడేళ్లు సడలిస్తారు. ఇక తొలి బ్యాచ్ అగ్నివీరులకు ఐదేళ్ల పాటు సడలింపు ఉంటుంది.
Explainers: అగ్నిపథ్ స్కీమ్‌పై ఎందుకంత వ్యతిరేకత..? భయాలు, అపోహలు, కేంద్రం వైఖరిపై న్యూస్18 వివరణ..
అగ్నివీర్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఉత్తరాది రాష్ట్రాలైన హర్యాణా, యూపీ, బీహార్‌తో పాటు తెలంగాణలోనూ ఆందోళనలు జరిగాయి. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ఆందోళనకారులు రైళ్లను తగులబెట్టి.. రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారు. నాలుగేళ్ల సర్వీస్ పూర్తైన తమ భవిష్యత్ ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. యువతను వాడుకొని వదిలేయడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. కేంద్ర సాయుద పోలీస్ బలగాల్లో 10 శాతం పోస్టులను అగ్నివీరులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agnipath Scheme, Amit Shah, Indian Army, Union Home Ministry