Agni-V Ballistic Missile : అమ్ముల పొదిలోని "అగ్ని".. అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని ప‌రీక్షించిన భార‌త్‌

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Agni-V Ballistic Missile : భార‌త దేశం (India) ర‌క్ష‌ణ రంగంలో మ‌రో పెద్ద ఘ‌న‌త‌ను సాధించింది. దేశ ఆయుధ సంప‌త్తిని ప్ర‌పంచానికి చాటేలా చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్ (Agni-V Ballistic Missile) ని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది.

  • Share this:
    భార‌త దేశం (India) ర‌క్ష‌ణ రంగంలో మ‌రో పెద్ద ఘ‌న‌త‌ను సాధించింది. దేశ ఆయుధ సంప‌త్తిని ప్ర‌పంచానికి చాటేలా చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్ (Agni-V Ballistic Missile) ని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్ర‌యోగం ఒడిశా (Odisha) తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అక్టోబ‌ర్ 27, 2021న రాత్రి 7.30నిమిషాల‌కు ప‌రీక్షించారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (Defense Research Development Organisation), భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించిన ఈ క్షిప‌ణి ప్ర‌యోగం 2020లోనే జ‌రుగాల్సి ఉంది. అయితే క‌రోనా ప‌రిస్థితుల రీత్యా వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం భార‌త్ చైనా స‌రిహ‌ద్దుల ప్ర‌తిష్ఠంభ‌న నేప‌థ్యంలో ఇండియా ఈ ప‌రీక్ష చేయ‌డం ఆస‌క్తిగా మారింది.

    Pegasus Spyware : అప్పుడు మ‌మ్మ‌ళ్ని అడ్డుకొన్నారు.. కానీ ఇప్పుడు.. : "సుప్రీం" ఉత్త‌ర్వుల‌పై రాహూల్‌గాంధీ హ‌ర్షం


    ఏమిటీ అగ్ని-5 ప్ర‌త్యేక‌త‌లు..
    - మూడు-దశల ఘన-ఇంధన ఇంజిన్‌ను ఉపయోగించే ఈ క్షిపణి 5,000-కిమీల పరిధి వరకు ఉన్న లక్ష్యాలను చాలా ఎక్కువ కచ్చితత్వంతో ఛేదించగలదు.
    - క‌చ్చిత‌మై ల‌క్ష్యాల‌ను ఛేదించ‌డం ఈ క్షిప‌ణి ల‌క్ష‌ణం. గ‌తంలోని అగ్ని-1,2,3,4ల‌కు మించి అద‌నపు సామ‌ర్థ్యాన్ని ఈ క్షిప‌ణి క‌లిగి ఉంటుంది.
    - ఇత‌రులు మ‌న దేశంపై దాడి చేస్తే త‌ప్ప ముందుగా ఈ క్షిప‌ణుల‌ను వాడొద్ద‌నేది ఇండియా క‌ట్టుబాటు.
    - డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (Defense Research Development Organisation) నిర్మించింది.

    MIT Awards : ఆరోత‌గ‌తి విద్యార్థి అద‌ర‌గొట్టాడు.. యాప్ త‌యారీతో ఎమ్ఐటీ నుంచి అవార్డు


    ఎందుకు ఇప్పుడే..
    క‌రోనా కార‌ణంగా గ‌తేడాది ప‌రీక్షించాల్సిన‌ క్షిప‌ణిని ఇప్పుడు ప్ర‌యోగించామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్న అంత‌ర్జాతీయ స‌మాజం ఈ పరీక్ష‌ను మ‌రో కోణంలోనే చూస్తున్నాయి.  అగ్ని-5 సుమారు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలిగే సామర్థ్యం క‌లిగి ఉంది. ఇప్పుడు ఈ క్షిప‌ణి ప్ర‌యోగం, ప‌నితీరును ఇండియా ప‌రీక్షించింది. ప్ర‌స్తుతం చైనా స‌రిహ‌ద్దు వెంట ఉన్న ప‌రిస్థితులు, బార్డ‌ర్‌పై చైనా కొత్త వ్య‌వ‌హ‌ర శైలీ ఇండియాకు విసుగు తెప్పిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అత్యంత ప్ర‌భావ‌శీమైన.. స‌మ‌ర్థ‌వంత‌మై క్షిప‌ణి అగ్ని-5ని ప‌రీక్షించ‌డం అంత‌ర్జాతీయం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్షిప‌ణి సామ‌ర్థ్యం 5000 కిలోమీట‌ర్లు అంటే చైనాలో దాదాపు ప్ర‌తీ చోట‌కు వెళ్లేలా దీన్ని ప్ర‌యోగించ‌వ‌చ్చ‌నే వాద‌న‌లు ఉన్నాయి. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే వీలున్న ఈ క్షిపణి క‌చ్చితంగా భారత్ తన అస్త్రాలకు మరింత పదునుపెడుతోందన‌డంలో సందేహం లేదు.
    Published by:Sharath Chandra
    First published: