అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ గురువారం రాత్రి ప్రయోగించి సక్సెస్ అయింది. అణ్వాయుధాలను ప్రయోగించగల సామర్ధ్యం ఉన్న ఈ బాలిస్టిక్ మిస్సైల్ పరిధి 5000 కిలోమీటర్లు. అయితే ఈ 5 వేల కిలోమీటర్ల దూరాన్ని మించి కూడా లక్ష్యాన్ని ఛేదించగల సామర్ధ్యం అగ్ని-5 సొంతం. అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్ సరిహద్దుల్లో చైనా-భారత్ జవాన్ల మధ్య ఘర్షణ తరువాత కొన్ని రోజులకే బీజింగ్ పై కూడా దాడి చేయగల సామర్ధ్యం ఉన్న అగ్ని-5ను భారత్ విజవంతంగా పరీక్షించడంతో మరో అడుగు ముందుకేసింది. ఈ ప్రయోగానికి ముందు బంగాళాఖాతం ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు.
India successfully carries out night trials of over 5,000 Km range Agni-5 ballistic missile
Read @ANI Story | https://t.co/jaEbuVlR9v#agni5 #ballisticmissile #India pic.twitter.com/JZiz3XbuA4
— ANI Digital (@ani_digital) December 15, 2022
అగ్ని-6పై ఫోకస్..
ఇక ప్రస్తుతం భారత్ అగ్ని-6పై పని చేస్తుంది. ఇది జలాంతర్గాముల నుండి భూమి నుండి ప్రయోగించగలదు. సుమారు 8 వేల నుండి 10 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు. గత రెండు దశాబ్దాలలో అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని- 5 క్షిపణులను అభివృద్ధి చేసింది. అంతేకాదు వీటన్నింటిని విజయవంతంగా ప్రయోగించింది. ఇక DRDO 2021లో కొత్త తరం అణు సామర్ధ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని పీని విజయవంతముగా పరీక్షించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, India, India-China