AGNEEPATH SCHEME OVER 94 THOUSEND APPLICATIONS RECIVED FOR IAF AGNIVEER RECRUITMENT PVN
Agneepath : అగ్నిపథ్ కు విశేష స్పందన..ఒక్క ఎయిర్ ఫోర్స్ కే 4 రోజుల్లో 94వేల దరఖాస్తులు
ప్రతీకాత్మక చిత్రం
IAF agniveer recruitment : కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ (Central Government)ఇటీవల అగ్నిపథ్ పథకాన్ని (Agnipath Scheme) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులందరినీ "అగ్నివీర్స్" అని పిలుస్తారు. ఈ పథకం కింద, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ అన్ని కేడర్లలో నాలుగు సంవత్సరాల పదవీకాలానికి మాత్రమే అగ్నివీర్లను నియమించుకుంటారు.
IAF agniveer recruitment : కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ (Central Government)ఇటీవల అగ్నిపథ్ పథకాన్ని (Agnipath Scheme) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులందరినీ "అగ్నివీర్స్" అని పిలుస్తారు. ఈ పథకం కింద, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ అన్ని కేడర్లలో నాలుగు సంవత్సరాల పదవీకాలానికి మాత్రమే అగ్నివీర్లను నియమించుకుంటారు. త్రివిధ దళాల్లో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ (Agnipath) పథకానికి ఇప్పుడు విశేష స్పందన లభిస్తోంది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF)లో నియామకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 94,281 దరఖాస్తులు వచ్చాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత శుక్రవారం మొదలవ్వగా సోమవారం ఉదయం 10:30 గంటల సమయానికి 94,281 మంది ‘అగ్నిపథ్ వాయు’ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు అందాయని ఎయిర్ఫోర్స్ తెలిపింది.
ఆదివారం వరకు 56,960 దరఖాస్తులు మాత్రమే రాగా. సోమవారం ఈ సంఖ్య భారీగా పెరిగిందని తెలిపింది.రిజిస్ట్రేషన్లు జులై 5 వరకు కొనసాగనున్నాయి. ఈలోగా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. . దరఖాస్తుల రిజిస్ట్రేషన్ గడువు జులై 5, 2022న ముగుస్తుందని రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఏ భరత్ భూషన్ బాబు తెలిపారు.
మరోవైపు,ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. పాత నియామక పద్ధతిని పునరుద్ధరించాలని యువకులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. అనేక రైళ్లను తగలబెట్టారు. మరోవైపు, ఈ పథకంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం అగ్నిపథ్ కాదని అంధకార పథ్ అని కాంగ్రెస్ విమర్శించింది. అయితే, పథకంపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. వెనువెంటనే నియామక ప్రక్రియ కోసం నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఈ పథకం కింద, 2022లో దాదాపు 46,000 మంది యువత రిక్రూట్ చేయబడతారు. ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ల సంఖ్య 5,000 పెరుగుతుంది. సైనికులకు నెలకు దాదాపు రూ.30,000-40,000 జీతం లభిస్తుంది.అగ్ని వీరులుగా ఎంపికైన వారికి.. మొదటి ఏడాది ప్రతీ నెల రూ.30 వేల వేతనం చెల్లించనున్నారు. రెండవ ఏడాది నెలకు రూ.33 వేల వేతనం ఉంటుంది. మూడవ ఏడాది నెలకు రూ.36,500 వేతనం చెల్లించనున్నారు. నాలుగవ ఏడాది నెలకు రూ.40 వేలు చెల్లిస్తారు. అయితే ఈ వేతనంలో నుంచి 30 శాతం కార్పస్ ఫండ్ కింద జమ చేస్తారు. అంటే మొదటి ఏడాది పాటు నెలకు రూ.21 వేలు మాత్రమే వేతనంగా అగ్నివీరులకు అందుతుంది. మిగతా 9 వేలు కార్పస్ ఫండ్ కింద జమ చేస్తారు. భారత ప్రభుత్వం కూడా అంతే మొత్తం జమ చేస్తుంది. 4 ఏళ్ల తర్వాత మొత్తం 10.4 లక్షలకు వడ్డీతో కలిపి అగ్నివీరులకు చెల్లిస్తారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.