India-Bangladesh Bus Service : కరోనా కారణంగా రెండేండ్ల క్రితం నిలిచిపోయిన భారత్ -బంగ్లాదేశ్ మధ్య బస్సు సర్వీసులు (India-Bangladesh Bus service)త్వరలో పునరుద్ధరించనున్నారు. త్రిపుర(Tripura) రాజధాని అగర్తల నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా(Dhaka)మీదుగా కోలకతాకు బస్సు సర్వీసు వచ్చే నెల 10న మళ్లీ ప్రారంభంకానున్నాయి. వాస్తవానికి బస్సు సర్వీసును ఏప్రిల్ 28న పునఃప్రారంభించాల్సి ఉండగా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా జూన్ 10కి వాయిదా వేసినట్లు త్రిపుర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. త్రిపుర రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ LH డార్లాంగ్...అంతర్జాతీయ బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించడం గురించి తెలియజేస్తూ బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మరియు బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్‌కు లేఖలు రాశారు.
త్రిపుర రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న ఈ సర్వీసు మొత్తం 500 కిలోమీటర్లు ప్రయాణించనుంది. దీంతో అగర్తల నుంచి ఢాకా మీదుగా కోల్‌కతాకు 19 గంటల్లోనే చేరుకోవచ్చు. అదే రైలులో అయితే 35 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. బస్సు టికెట్లు జూన్ 1 నుండి కృష్ణానగర్‌లోని త్రిపుర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కౌంటర్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ బస్సు ఎక్కేందుకు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ మరియు వీసా అవసరం అని రవాణా శాఖ అధికారి ఒకరు తెలిపారు. అగర్తల నుండి ఢాకా మీదుగా కోల్‌కతాకు ఒక్కొక్కరికి రూ. 2,300, అగర్తల నుండి ఢాకాకు రూ. 1,000 ఛార్జీ వసూలు చేయబడుతుందని తెలిపారు. అసోంలో కొండచరియలు విరిగిపడటం వల్ల ఫ్లయింగ్ రేట్లు మరియు సుదూర రైళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రజలు అంతర్జాతీయ బస్సు సర్వీస్ నుండి ప్రయోజనం పొందుతారని ఓ అధికారి తెలిపారు.
ALSO READ Plane Crash : నేపాల్ లో ప్రయాణికుల విమానం క్రాష్!..అందులో పలువురు భారతీయులు
మరోవైపు,భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో రైలు సర్వీస్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. వెస్ట్ బెంగాల్‌లోని న్యూ జల్పాయిగురి నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మధ్య మిటాలి ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. అలాగే కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లకు పైగా భారత్, బంగ్లాదేశ్ మధ్య నిలిచిపోయిన రైలు సేవలను ఆదివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. మే 29న భారత్-బంగ్లాదేశ్ మైత్రీ ఎక్స్‌ప్రెస్ రైలు, మే 30న బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, Bus services, Kolkata, Tripura